బిజినెస్

ఆల్‌టైం రికార్డు ఆధిక్యతకు సెనె్సక్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: వరుసగా నాలుగో రోజూ దేశీయ మార్కెట్ సూచీలు లాభాలను నమోదు చేశాయి. బీఎస్‌ఈ బెంచ్‌మార్క్ సెనె్సక్స్ 185 పాయింట్లు లాభపడి ఆల్‌టైం రికార్డు ఆధిక్యతను నమోదుచేసి 39.055 మార్కును దాటింది. అలాగే ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ సైతం 11.700 మార్కును దాటింది. ప్రధానంగా మోటారు వాహనాలు, ఐటీ, బ్యాంకింగ్ స్టాక్స్‌లో పెద్ద ఎత్తున వాటాల కొనుగోళ్లు జరిగాయి. రిజర్వు బ్యాంకు మరోమారు రేట్లలో కోత విధించే అవకాశాలున్నాయన్న కథనాలు స్టాక్ మార్కెట్లకు ఊతమిచ్చాయి. ప్రధానంగా సెనె్సక్స్ ర్యాలీలో టాటామోటార్స్ 8 శాతం లాభపడి వరుసగా రెండోరోజూ అగ్రభాగాన నిలిచింది. అలాగే భారతీ ఎయిర్‌టెల్, టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్, పవర్‌గ్రిడ్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా సైతం సుమారు 5 శాతం లాభపడ్డాయి. అయితే బజాజ్ ఆటో, సన్‌పార్మా, వేదాంత, టాటాస్టీల్, హెచ్‌సీఎల్ టెక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ స్టాక్స్‌లో లాభాల స్వీకరణతో బాటు మదుపర్లు వాటాల విక్రయానికి పాల్పడటంతో నష్టాలను చవిచూశాయి. కాగా 30 షేర్ల సెనె్సక్స్ తొలుత సానుకూల వాతావరణంలోనే 38,988.57 వద్ద ఆరంభమైంది. అయితే ఒక దశలో 39,121.69కి ఎగబాకి మళ్లీ 38,846.96 వద్దకు దిగివచ్చింది. ఇలా ఊగిసలాటకు గురైన సెనె్సక్స్ సూచీ చివరకు 184.78 పాయింట్ల లాభంతో 39.056.65 వద్ద స్థిరపడింది. అలాగే నిఫ్టీ సైతం 11,711.55 వద్ద ఆరంభమై ఆ తర్వాత రికార్డు స్థాయి ఆధిక్యతైన 11,729.35 పాయింట్ల చేరింది. చివరకు 44.05 పాయింట్లు ఆధిక్యతతో 0.38 శాతం లాభపడి 11,713.20 వద్ద స్థిరపడింది. ఇక రంగాలవారీగా చూస్తే రియాలిటీ, టెలికాం, వాహన, ఐటీ రంగాలు మంచి లాభాలను అందుకున్నాయి. మరోవైపు చమురు, సహజవాయువులు, ఎఫ్‌ఎమ్‌సీజీ, వౌలిక పరికరాల సూచీలు నష్టపోయాయి. కాగా ఆర్బీఐ రేట్ల నిర్ణయ కమిటీ మంగళవారం నుంచి మూడు రోజుల సమావేశాన్ని ఆరంభించింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో నిర్వహిస్తున్న ఈ తొలి నెలవారీ సమావేశంలో మరోమారు 25 బేసిస్ పాయింట్ల మేర రేట్ల కోతపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయన్న అంచనాలతో స్టాక్ మార్కెట్లకు ఊతం లభించింది. ఈ సమావేశంలో తీసుకునే తుది నిర్ణయంపై మదుపర్లు దృష్టి కేంద్రీకరించారు. చైనా, అమెరికాల్లో తయారీ రంగాల్లో వృద్ధి నమోదవడంతో అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లకు ఊతం లభించింది. అలాగే దేశీయంగా ఆర్బీఐ నిర్ణయంతో ఆర్థికాభివృద్ధి జరుగుతుందన్న సానుకూల దృక్పథం మదుపర్లలో ఉంది.