బిజినెస్

రుణాలు సక్రమంగా తిరిగి చెల్లించేలా నిబంధనలు తేవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 3: బ్యాంకు రుణాలు తీసుకున్న వారు సకాలంలో తిరిగి చెల్లించేలా కేంద్ర ప్రభుత్వం, రిజర్వు బ్యాంకు సరికొత్త నిబంధనలను తీసుకురావాల్సిన అవరసం ఉందని నీతీ ఆయోగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అమితాబ్ కాంత్ బుధవారం నాడిక్కడ పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రస్తుతం ఉన్న ద్రవ్య సాధికారిక నిబంధనల్లోని లొసుగులపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుత ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలు విచ్చలవిడిగా ఆదాయ హామీ పథకాలను ప్రకటిస్తున్న క్రమంలో పాలనా విభాగాల్లోని అధికారులు సైతం నిధుల దుర్వినియోగాన్ని అరికట్టాల్సిన అవసరాన్ని నొక్కిచెబుతున్నారని ఆయన తెలిపారు. 2018 ఫిబ్రవరి 12న నిరర్థక ఆస్తుల విషయంలో ఆర్బీఐ విడుదల చేసిన సర్క్యులర్‌పై సుప్రీం కోర్టు వ్యాఖ్యానిస్తూ ఇదో అల్ట్రా వైరస్2అని పేర్కొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అలాగే దీనిపై ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం పునఃపరిశీలన చేసి రుణాలు తీసుకున్న వారిలో క్రమశిక్షణ నెలకొనేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. స్టాక్ ఎక్చేంజీల ప్రపంచ సమాఖ్య నేతృత్వంలో బుధవారం నాడిక్కన జరిగిన సదస్సులో అమితాబ్ కాంత్ ప్రసంగించారు. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ని బంధనల్లో మార్పు చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఆయన సూచించారు. పెట్టుబడిదారీ విధానంలో ఆశ్రీ త పక్షపాతాన్ని పారదోలేందుకు, ఆర్థిక క్రమశిక్షణను పాదుకొల్పేందుకు, మంచి నియంత్రణను ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే ఆర్బీఐ, ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తున్నాయని ఆయన తెలిపారు. మొండి బకాయిల వసూళ్లకు చేపడుతున్న విధానాలు, మార్గదర్శకాల్లో ప్రగతి గోచరిస్తోందన్నారు. రూ.2000 కోట్లకు పైబడిన మోసాలకు సంబంధిన కేసులను 180 రోజుల్లోగా పరిష్కరించేందుకు నిర్ణయాలు జరగాలని, అలాగే తీసుకున్న రుణాల చెల్లింపు ఒక్కరోజు ఆలస్యమైనా బ్యాంకులను మోసగించిన కేసులుగా కోర్టుకు నివేదించాలని మంగళవారం ఆర్బీఐ బ్యాంకులకు సర్క్యులర్ జారీ చేయడా న్ని సుప్రీం తప్పుబట్టిందన్నారు. అనూహ్యంగా రోహింన్‌టన్ నారిమన్ ఏక సభ్య ధర్మాసనం ఇచ్చిన రూలింగ్ కారణంగా బ్యాంకుల నిర్ణయాధికారాలకు విఘాతం ఏర్పడి సుమారు రూ. 3.8 లక్షల కోట్లకు సంబంధించిన 70 అతిపెద్ద ఖాతాలు నిరర్ధకంగా మారాయన్నారు. ప్రత్యేకించి బ్యాంకులకు రుణాలు చెల్లించాల్సిన 34 విద్యుత్ కంపెనీలు వేసిన పిటిషన్ పేపథ్యంలో ఆ ఏకసభ్య ధర్మాసనం రూలింగ్ వచ్చింది. అయితే ఆ ఆదేశాలపై న్యాయనిపుణులు, పారిశ్రామిక ప్రముఖులు విముఖత వ్యక్తం చేశారు. ఈ ఆదేశాల వల్ల రుణాలు తీసుకున్న వ్యక్తుల వ్యవహార శైలిలో మార్పు వచ్చింది. అది ప్రస్తుతం అత్యంత నీచ స్థితికి చేరిందని అమితాబ్ కాంత్ ఈ సందర్భంగా వివరించారు. కాగా దేశంలోని 20 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరేలా న్యాయ్ పథకాన్ని అమలు చేస్తామని తద్వారా ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ.72వేల ఆదాయం చేకూరుస్తామన్న హామీని కాంగ్రెస్ ఇవ్వడాన్ని ఆయన ప్రస్తావిస్తూ ఏడాదికి 3.6 లక్షల కోట్ల భారంపడే ఇలాంటి పథకాల వల్ల ఎంతవరకు అభివృద్ధి జరుగుతుందనేది చూడాల్సివుందన్నారు. వృద్ధిలేకపోతే మరోమారు పథకానికి సంబంధించిన సొమ్ము చెల్లించడం కష్టమన్నారు. ఇవన్నీ అమలు జరగాలం టే దేశ వృద్ధిరేటు 7 శాతం నుంచి 9 లేదా 10 శాతానికి పెరగాలన్నారు. తయారీ రంగం అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరిస్తే ఎగుమతులు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు.