బిజినెస్

మరో 15 విమానాలను రద్దు చేసుకున్న జెట్ ఎయిర్‌వేస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: ఆర్థిక సంక్షోభంలో ఉన్న జెట్ ఎయిర్‌వేస్ వాటాల విలువ బుధవారం మరో నాలుగు శాతం పడిపోయింది. ఈ సంస్థ తాజాగా మరో 15 విమానాల నిర్వహణను ఆపివేయడంతో స్టాక్ మార్కెట్‌లో తీవ్ర ప్రతికూలతలను ఎదుర్కోవాల్సి వచ్చిందని విమానాలు విశే్లషకులు అంచనా వేస్తున్నారు. లీజు, అద్దెల బకాయిలు భారీగా పేరుకుపోయిన క్రమంలో అనివార్యంగా విమానాల నిర్వహణను ఆపివేయాల్సి వచ్చిందని తెలుస్తోంది. ఒకప్పుడు 650 విమానాలను దేశ, విదేశాల్లో నడిపిన ఈ సంస్థ ప్రస్తుతం కేవలం 20 విమానాలను మాత్రమే నడిపే స్థాయికి పడిపోవడం శోచనీయం. కాగా బీఎస్‌ఈలో బుధవారం ఈ సంస్థకు చెందిన వాటాలు స్టాక్ మార్కెట్లో ప్రతికూలతల నడుమ రూ.257.80 వద్ద ఆరంభమై 3.90 శాతం నష్టపోయి రూ. 254.55 చేరింది. అలాగే ఎన్‌ఎస్‌ఈలోనూ ఈ వాటాధర 4 శాతం నష్టపోయి 254.40 రూపాయలకు దిగివచ్చింది. కాగా కేవలం లీజు, అద్దెల బకాయిలు పేరుకుపోవడం వల్లనే ఇప్పటి వరకు ఈ సంస్థకు చెందిన 69 విమానాల నిర్వహణ రద్దవడం గమనార్హం. తమకు బకాయి ఉన్న మూడు నెలల వేతనాన్ని వడ్డీతో సహా చెల్లించాలని జెట్ విమానయాన సంస్థకు చెందిన రేషనల్ ఏవియేటర్ గిల్డ్ విమాన యాన నియంత్రణ విభాగం డీజీసీఏకు, సంస్థ సీఈవో వినయ్ దూబేకు విన్నవించడం జరిగింది.