బిజినెస్

నాలుగు రోజుల లాభాలకు తెర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ నాలుగు రోజుల పరుగుకు తెరపడింది. మదుపరులు లాభాల స్వీకరణకు పూనుకోవడంతో పాటు ఈ సంవత్సరం వర్షపాతం సాధారణ స్థాయికన్నా తక్కువగా నమోదవుతుందనే అంచనాల కారణంగా బుధవారం సెనె్సక్స్ సుమారు 180 పాయింట్లు పడిపోయింది. ప్రపంచ మార్కెట్లలో బలమయిన ర్యాలీ వచ్చినప్పటికీ దేశీయ మార్కెట్లు మాత్రం తమ జీవితకాల గరిష్ఠ స్థాయిలను నిలబెట్టుకోలేక పోయాయి. ప్రధానంగా చమురు- సహజ వాయువు, టెలికం, లోహ, హెల్త్‌కేర్ రంగాల షేర్ల ధరలు పడిపోవడంతో ఈ సూచీ దిగజారింది. బుధవారం సెషన్‌లో సుమారు 450 పాయింట్ల పరిధిలో పైకి కిందికి కదలాడిన సెనె్సక్స్ చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 179.53 పాయింట్ల (0.46 శాతం) దిగువన 38,877.12 పాయింట్ల వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ కూడా బుధవారం ఆరంభంలో సాధించిన లాభాలను కోల్పోయింది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 69.25 పాయింట్ల (0.59 శాతం) దిగువన 11,643.95 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఈ సంవత్సరం వర్షపాతం సాధారణ స్థాయికన్నా తక్కువగా నమోదవుతుందని స్కైమెట్ వేసిన అంచనా వల్ల మార్కెట్ కీలక సూచీలు ఆరంభంలో ఆర్జించిన లాభాలను కోల్పోయాయి అని సాంక్టమ్ వెల్త్ మేనేజ్‌మెంట్ చీఫ్ ఇనె్వస్ట్‌మెంట్ ఆఫీసర్ సునిల్ శర్మ తెలిపారు. ఇదిలా ఉండగా, బుధవారం నాటి లావాదేవీలలో సెనె్సక్స్ ప్యాక్‌లోని సంస్థల్లో ఎస్‌బీఐ అత్యధికంగా 2.40 శాతం నష్టపోయింది. యెస్ బ్యాంక్, భారతి ఎయిర్‌టెల్, ఎల్‌అండ్‌టీ, సన్ ఫార్మా, ఎంఅండ్‌ఎం, ఐసీఐసీఐ బ్యాంక్, ఓఎన్‌జీసీ, రిల్, ఆసియన్ పెయింట్స్, వేదాంత, హెచ్‌యూఎల్ సంస్థలు 2.37 శాతం వరకు నష్టపోయి తరువాత స్థానాల్లో నిలిచాయి. మరోవైపు, మారుతి, హెచ్‌సీఎల్ టెక్నాలజి, హెచ్‌డీఎఫ్‌సీ, టాటా స్టీల్, పవర్‌గ్రిడ్, హీరో మోటోకార్ప్, టీసీఎస్ 2.78 శాతం వరకు లాభపడ్డాయి.