బిజినెస్

కోలుకున్న మార్కెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 5: అమెరికా, చైనా దేశాల మధ్య చర్చలు మొదలయ్యాయని, దీనితో ఇరువురి మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధానికి త్వరలోనే తెరపడుతుందని వచ్చిన వార్తల ప్రభావం భారత్‌తోపాటు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల స్టాక్ మార్కెట్లపై కూడా పడింది. బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో ఈ వారం నష్టాలను ఎదుర్కొన్న సెనె్సక్స్, లావాదేవీలకు చివరి రోజైన శుక్రవారం 177.51 పాయింట్లు (0.49 శాతం) లాభపడి, 38,862.23 పాయింట్లకు చేరింది. జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లోనూ సానుకూల ధోరణులు కనిపించాయి. ఫలితంగా నిఫ్టీ 67.95 పాయింట్లు (0,59 శాతం) పెరిగి, 11,665.95 పాయింట్ల వద్ద ముగిసింది. సెనె్సక్స్‌లో శుక్రవారం టాటా స్టీల్ షేర్లు భారీగా లాభపడ్డాయి. ఈ కంపెనీ షేర్ల విలువ 3.36 శాతం పెరగ్గా, వేదాంత కంపెనీ షేర్లు 2.38 శాతం లాభాలను ఆర్జించాయి. టీసీఎస్ 1.84, ఇండస్‌ఇండ్ 1.68 శాతం చొప్పున లాభాలను నమోదు చేశాయి. శుక్రవారం లాభాలను సంపాదించిన కంపెనీల్లో ఇన్ఫోసిస్ (1.52 శాతం), ఓఎన్‌జీసీ (1.03 శాతం), కోటక్ మహీంద్ర (0.82 శాతం), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (0.76 శాతం), హెచ్‌డీఎఫ్‌సీ (0.74 శాతం) షేర్లు కూడా లాభాల్లో ట్రేడయ్యాయి. కాగా, ఎస్‌బీఐ (1.40 శాతం), పవర్‌గ్రిడ్ (1.36 శాతం), హీరో మోటార్స్ (0.78 శాతం), ఎన్‌టీపీసీ (0.70 శాతం), సన్ ఫార్మా (0.67 శాతం) నష్టాలను ఎదుర్కొన్న కంపెనీల జాబితాలో ఉన్నాయి. ఎన్‌ఎస్‌ఈలోనూ టాటా స్టీల్ అత్యధికంగా 3.74 శాతం లాభాలను ఆర్జించింది. ఆల్ట్రాటెక్ (3.04 శాతం), బజాజ్ ఫిన్ (2.75 శాతం), హిందాల్‌కో (2.73 శాతం), జేఎస్‌డబ్ల్యూ స్టీల్ (2.62 శాతం) షేర్లు కూడా లాభాలను సంపాదించాయి. పవర్‌గ్రిడ్ (1.50 శాతం), బ్రిటానియా (1.44 శాతం), జీ ఎంటర్‌టైనె్మంట్ (1.33 శాతం), ఎస్‌బీఐ (1.27 శాతం), డాక్టర్ రెడ్డీస్ (0.66 శాతం) నష్టాలను చవిచూశాయి.