బిజినెస్

మొండి బాకీలపై ఆర్బీఐ దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 6: పేరుకుపోతున్న రాని బాకీల వసూళ్లపై ఆర్బీఐ దృష్టి కేంద్రీకరించింది. ఈ క్రమంలోనే, గతంలో జారీ చేసిన సర్క్యులర్ స్థానంలోనే, సవరించిన సర్క్యులర్‌ను విడుదల చేసేందుకు కసరత్తు మొదలు పెట్టింది. ఒకటిరెండు రోజుల్లో ఈ విషయంపై స్పష్టత రావచ్చని అంటున్నారు. ఆర్బీఐ గవర్నర్‌గా శక్తికాంత దాస్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత, వడ్డీ రేట్లను రెండు పర్యాయాలు తగ్గించిన విషయం తెలిసిందే. రెండు నెలలకు ఒకసారి సమావేశమయ్యే ఆరుగురు సభ్యులతో కూడిన మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీఐ) ఇప్పటి వరకూ రెండు పర్యాయాలు శక్తిదాస్ కాంత్ అధ్యక్షతన సమావేశమైంది. రెండు సమావేశాల్లోనూ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆర్బీఐని శక్తికాంత్ దాస్ ఏ దిశలో ముందుకు తీసుకెళ్లాలని యోచిస్తున్నారనే విషయం ఆర్బీఐ తీసుకుంటున్న నిర్ణయాలు స్పష్టం చేస్తున్నాయి.