బిజినెస్

వైజ్ఞానిక పరిశోధనల విస్తృతితో దేశ ఆర్థికాభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: విజ్ఞాన శాస్త్రంపై మరింతగా నిధుల ఖర్చును పెంచడం ద్వారా వచ్చే మూడేళ్లలో దేశ వృద్ధిరేటును దాదాపు 1.2 శాతం పెంచేందుకు వీలుంటుందని నీతిఆయోగ్ సభ్యులు కే. సరస్వత్ గురువారం నాడిక్కడ సూచించారు. అలాగే విజ్ఞాన శాస్త్రంలో పరిశోధనలు చేస్తున్న సంస్థలు కూడా సమాజాభివృద్ధికి, మార్పునకు దోహదం చేసే విషయాలపై ప్రధాన దృష్టిని కేంద్రీకరించాలని సూచించారు. దేశ ఆర్థికాభివృద్థికి దోహదం చేసే వౌలిక వైజ్ఞానిక అంశాలపై పరిశోధనలను విస్తృతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉందని తెలిపారు. నీతి ఆయోగ్, లక్ష్మీమిట్టల్ కుటుంబానికి చెందిన దక్షిణాసియా ఇన్‌స్టిట్యూట్ (ఎల్‌ఎంఎస్‌ఏఐ) సంయుక్తంగా ఇక్కడి హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో సరస్వత్ పాల్గొని ప్రసంగించారు. విశ్వవిద్యాలయాలు, ప్రయోగశాలలను దాటుకుని ప్రస్తుతం విజ్ఞాన శాస్త్ర పరిశోధనలు గణనీయ మార్పుతో ముందడుగు వేస్తున్నాయని డీఆర్‌డీవో మాజీ చీఫ్ కూడా అయిన సరస్వత్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం మంజూరు చేస్తున్న సరికొత్త ప్రాజెక్టుల్లో సైబర్-్ఫజికల్ రీసెర్చ్, కృత్రిమ మేథస్సు వంటివి ఎన్నో పరిశోధనలకు, కొత్త ఆవిష్కరణలకు దారిచూపుతున్నాయన్నారు, కాగా సమావేశంలో పాల్గొన్న బయోకాన్ చైర్‌పర్సన్, ఎండీ ముజుందార్ షా మాట్లాడుతూ బేసిక్ సైన్స్‌లో పరిశోధనలు భవిష్యత్తులో మరింతగా ప్రాముఖ్యతను సంతరించుకోనున్నాయన్నారు. విజ్ఞాన, సాంకేతిక శాస్త్రాల అభివృద్ధి ద్వారా దేశ ఆర్థికాభివృద్ధి జరుగుతుందని అన్నారు. నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ మాట్లాడుతూ విజ్ఞాన శాస్తవ్రేత్తలు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో సమన్వయంగా వ్యవహరించి దేశ ఆర్థికాభివృద్ధిని 10 శాతానికి పెంచాలని సూచించారు. ఒక సర్వే ప్రకారం మనదేశంలో గత రెండు దశాబ్థాలుగా పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ)పై కేవలం 6 నుంచి 7 శాతం మాత్రమే ఖర్చు చేయడం జరుగుతోందని, ఇది అమెరికా, చైనా, దక్షిణ కొరియా, ఇజ్రాయెల్ దేశాల కంటే చాలా తక్కువని ఆయన తెలిపారు.