బిజినెస్

‘పవన్ హాన్స్’ మధ్యంతర సీఎండీగా ఉషాపథీకి అదనపు బాధ్యతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 7: కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్న ఉషాపధీకి ‘పవన్ హాన్స్’ లిమిటెడ్ చైర్‌పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా అదనపు బాధ్యలను ప్రభుత్వం అప్పగించింది. ఆ కంపెనీ ఈమేరకు ఆదివారం నాడిక్కడ ఓ ప్రకటనను విడుదల చేసింది. ప్రభుత్వ పెట్టుబడులు తగ్గించుకునేందుకు కసరత్తు జరుగుతున్న ఈ హెలికాప్టర్ సేవల కల్పన సంస్థకు మధ్యంతర సీఎండీగా ఉషాపథీ శనివారం నాడు బాధ్యతలను చేపట్టారు. కాగా తమ కంపెనీకి ఉషాపథీ తొలి మహీళా సీఎం డీ అని పవన్‌హాన్స్ లిమిటెడ్ సంస్థ అధికారులు ఆదివారం ఇక్కడ తెలిపారు. ఏప్రిల్ 3న ఉషాపథీ నియామకానికి సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీచేసింది. వచ్చే మూడు నెలల కాలానికి, లేదా ఎగ్యులర్ సీఎండీ నియామకం వరకు ఆమెకు ఈఅదనపు బాధ్యతలు ఉంటాయి. కాగా పవన్‌హాన్స్ లిమిటెడ్‌లో పెట్టుబడులను తగ్గించుకునేందుకు సంబంధించిన డిసినె్వస్ట్‌మెం ట్ ప్రాసెస్‌ను గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. ఈ సంస్ధలో ప్రభుత్వానికి 51 శాతం వాటాలుండగా ఓఎన్‌జీసీకి 49 శాతం వాటాలున్నాయి.