బిజినెస్

‘స్టెరిలైట్’ చేతికి పంపా విద్యుత్ సరఫరా ప్రాజెక్టు బ్రెజిల్‌లో ఒప్పందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: దాదాపు రూ.1,394.79 కోట్లు ఖర్చుతో చేపట్టే ‘పంపా విద్యుత్ సరఫరా ప్రాజెక్టు’ నిర్మాణం కోసం బ్రెజిల్‌లోని రియోగ్రాండే డు సుల్‌లో ఒప్పందం కుదుర్చుకున్నట్టు విద్యుత్ రెగ్యులేటరీ ఏజెన్సీ ‘స్టెరిలైట్ పవర్’ శుక్రవారం నాడిక్కడ తెలిపింది. బ్రెజిల్ విద్యుత్ నియంత్రణ ఏజెన్సీ ‘అనీల్’ నిర్వహించిన వేలంలో ఈ 13వ బ్యాచ్ పనులకు సంబంధించిన ఒప్పందాన్ని సొంతం చేసుకోవడం జరిగిందని స్టెర్లైట్ పవర్ ఆ ప్రకటనలో వివరించింది. 2023 మార్చి నాటికి ఈ బృహత్తర ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తి చేయాల్సివుందని, ఈ ఒప్పందం ద్వారా నిర్మాణంలోని అతి ప్రధాన మైలురాళ్లను కంపెనీ అందుకోవడానికి అవకాశం ఏర్పడిందని తెలిపింది. భారత్‌లో చేపడుతున్న ఇతర ప్రాజెక్టుల్లాగే ఈ ప్రాజెక్టు షెడ్యూల్ విడుదలను చేపడతామని వివరించింది. ఈ ప్రాజెక్టు ద్వారా మూడు అతిపెద్ద విద్యుత్ సరఫరా లైన్ల నిర్మాణం మొత్తం 316 కిలోమీటర్ల మేర చేపట్టాల్సివుందని, అలాగే 1,544 ఎమ్‌వీఏ సామర్థ్యం కలిగిన రెండు సబ్‌స్టేషన్లను నిర్మిస్తామని తెలిపింది. ఈ ప్రాజెక్టు ద్వారా 74.72 మిలియన్ బ్రెజిల్ రియాల్స్ (రూ.133.98 కోట్లు) వార్షికాదాయం సమకూతుందని అంచనా వేసినట్టు తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం తమ కంపెనీ 777.8 మిలియన్ బ్రెజిల్ రియాల్స్ (రూ.1,394.79 కోట్లు) పెట్టుబడిపెట్టడం జరుగుతుందన్నారు. సుమారు 30 ఏళ్లపాటు జరిగే ఈ ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణకు సంబంధించిన పటిష్టవంతమైన మార్గదర్శకాలు, ప్రణాళికలు రూపొందించాల్సివుందని తెలిపారు. ప్రాజెక్టును అనుకున్న సమయానికి పూర్తయ్యేలా ఒక స్పష్టమైన విజన్‌ను, సహకారాన్ని బ్రెజిల్ మార్కెట్ అందజేస్తుందని, ఇందులో తమ విజయ ఫలాలు ఇటు భారత్‌తోబాటు బ్రెజిల్‌లో సైతం ప్రతిఫలిస్తాయని ఆశిస్తున్నట్టు స్టెరిలైట్ పవర్ అంతర్జాతీయ వౌలిక వసతుల వాణిజ్య విభాగం సీఈవో వేద్ మణి తివారీ తెలిపారు. ఇప్పటి వరకు స్టెర్లైట్ పవర్ ద్వారా విద్యుత్ సరఫరాకు సంబంధించిన వౌలిక వసతుల కల్పన ప్రాజెక్టులను సుమారు 12,500 కిలోమీటర్ల మేర 20,500 మెగావాట్ల విద్యుత్ సరఫరాకు అనుగుణంగా భారత్, బ్రెజిల్ దేశాల్లో చేపట్టినట్టు ఆయన వివరించారు.