బిజినెస్

వారాంతపు లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 12: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండోరోజైన శుక్రవారం సైతం లాభాల్లోనే నమోదు చేశాయి. అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల్లో సుమారు వారం రోజుల పాటు ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కొన్న మదుపర్లు లాభాలను అందుకోవడానికి ఎట్టకేలకు వీలుకలిగింది. బీఎస్‌ఈలో 30 షేర్ల సూచీ సెనె్సక్స్ ఇంట్రాడేలో దాదాపు 200 పాయింట్లు ఎగబాకి చివరిగా 160.10 పాయిట్ల ఆధిక్యతతో 0.41 శాతం లాభపడి 36,767.11 వద్ద స్థిరపడింది. ఇందులో శీఘ్ర వినిమయ వస్తువులు (ఎఫ్‌ఎమ్‌సీజీ), వాహన, బ్యాంక్ స్టాక్స్ అత్యధిక లాభాలను సంతరించుకున్నాయి. అలాగే ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ 46.75 పాయింట్లు ఎగబాకి 0.40 శాతం లాభాలతో 11,643.45 వద్ద స్థిరపడింది. ఈ వారం రోజుల్లో సెనె్సక్స్ 95.12 పాయింట్లు, నిఫ్టీ 22.5 పాయింట్ల వంతున నష్టపోవడం జరిగింది. ఈ త్రైమాసికంలో వచ్చే గణాంకాలు, సార్వత్రిక ఎన్నిక ల సరళి ప్రధానంగా స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేయవచ్చని ఆర్థిక రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే ఆదాయ విషయానికొస్తే కార్పొరేట్ రుణ బ్యాంకులకు, విద్యుత్ సంస్థలకు ఆరోగ్యకరమైన, లాభకరమైన వృద్ధి సెనె్సక్స్‌లో నమోదు చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. సెనె్సక్స్ ప్యాక్ లో అత్యధికంగా 3.14 శాతం లాభపడి ఐటీసీ అగ్రభాగాన నిలిచింది. మారుతీ సుజుకీ, ఆక్సిస్ బ్యాం క్, హీరో మోటోకార్ప్, వేదాంత, ఆసియన్ పెయిం ట్స్, ఎంఅండ్‌ఎం, హెచ్‌యూఎల్, బజాజ్ ఆటో, పవర్‌గ్రిడ్ కూడా లాభాలను సంతరించుకున్నాయి. దాదాపు 2.13 శాతం ఈ సంస్థలు లాభపడ్డాయి. మరోవైపు భారతీ ఎయిర్‌టెల్, బజాజ్ ఫైనాన్స్, ఎల్‌అండ్‌టీ, టాటా మోటార్స్, ఇండస్‌ఇండ్ బ్యాం క్, టాటాస్టీ, హెచ్‌సీఎల్ టెక్, ఓఎన్‌జీసీలు అత్యధికంగా నష్టపోయాయి. ఈ సంస్థలు దాదాపు 1.71 శాతం నష్టాలను సంతరించుకున్నాయి. ఇక ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ 0.63 శాతం అధికంగా లాభపడింది. ఐతే దీని ప్రత్యర్థి సంస్థ టీసీఎస్ 0.26 శాతం నష్టపోయింది. ఇక రంగాల వారీగా చూస్తే బీఎస్‌ఈలో ఎఫ్‌ఎమ్‌సీజీ సూచీ 1.71 శాతం లాభాలు సంతరించుకోగా, యుటిలిటీస్, విద్యుత్, మోటారు వాహనాలు, బ్యాంకింగ్ షేర్లు 1.12 శాతం లాభాల వృద్థిని నమోదు చేశాయి. కాగా చిన్న మొత్తాల్లో పెట్టుబడులుండే మిడ్‌కాప్ సూచీ బీఎస్‌ఈలో 0.29 శాతం లాభపడింది. రూపాయి విలువ బలహీన పడినా మార్కెట్లు సానుకూలతలను సంతరించుకోవడానికి మదుపర్లు రాబోయే లాభాలపై దృష్టి కేంద్రీకరించడమే కారణమని మార్కెట్ విశే్లషకుడు వినోద్ నాయర్ అభిప్రాయపడ్డారు. ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ నిర్దేశిత లక్ష్యానికంటే దిగువ న ఉండే అవకాశాలున్నాయన్న అంచనాల నేపథ్యంలో బ్యాంకు ల పనితీరు మెరుగుపడిందని, అలాగే ప్రస్తుత ఎన్నికల ఫలితాల విశే్లషణలు సైతం మదుపర్లకు సానుకూల దృక్పథాన్ని కలిగించిందంటున్నా రు. ఇలావుండగా విదేశీ సంస్థాగత మదుపర్లు దాదాపు రూ.476.51 కోట్ల విలువైన వాటాల ను గురువారం కొనుగోలు చేయగా, దేశీయ సంస్థాగత మదుపర్లు రూ. 16.58 కోట్ల విలువైన వాటాలను విక్రయించారని స్టాక్ ఎక్చేంజ్ ప్రాథమిక గణాంకాలు వెల్లడించాయి. కాగా అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం మిశ్రమ ఫలితాలతో ముగిశాయి.