బిజినెస్

త్వరలో 16 బోయింగ్ 737-800 ఎన్‌జీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: ప్రైవేటు విమానయాన సంస్థ స్పైస్ జెట్ వాటాలు శుక్రవారం 8.5 శాతం మేర వృద్ధిని నమోదు చేశాయి. తాము మరో 316 బోయింగ్ 737-800 ఎన్‌జీ2 విమానాన్ని అదనంగా నడపబోతున్నట్టు ఆ సంస్థ ప్రకటించడంతో వాటాలకు ఊతం లభించిందని విశే్లషకులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు నిలిపివేసిన విమానాల వల్ల ఏర్పడిన కొరతను భర్తీ చేసేందుకు తామీ చర్యలు చేపట్టామని సంస్థ అధికారులు స్పష్టం చేశారు. కాగా శుక్రవారం మొత్తం 8.54 శాతం మేర లాభపడిన స్పైస్‌జెట్ వాటాలు ఒక్కో వాటా 109.90 రూపాయలుగా ట్రేడయ్యాయి. ఒకదశలో ఈ సంస్థ వాటాల విలువ సుమారు 10.61 శాతం ఎగబాకి రూ.112కు చేరింది. మొత్తం రోజులో 99.96 లక్షల వాటాలు బీఎస్‌ఈలోట్రేడయ్యాయి. అలాగే కంపెనీ మార్కెట్ విలువ సైతం 518.9 కోట్లు అదనంగా పెరిగి మొత్తం రూ.6,590.90 కోట్లకు చేరింది. దేశంలో విమానాల కొరత కారణంగా విమాన చార్జీలు గత కొన్ని వారాల నుంచి గణనీయంగా పెరుగుతున్న క్రమంలో సర్వత్రా ఆందోళన వ్యక్తమవగా స్పైస్ జెట్ ప్రకటన కొంత ఊరట కలిగించింది. ఇప్పటివరకు నిలిపివేసిన విమానాల్లో 90 శాతం జెట్ ఎయిర్‌వేస్‌కు చెందినవే కావడం గమనార్హం. మొత్తం 119 విమానాలను ఆ విమానయాన సంస్థ నిలిపివేయడం జరిగింది. కాగా ఇథియోపియాకు చెందిన బోయింగ్ విమానం ప్రమాదానికి గురై భారీగా ప్రాణనష్టం జరగడంతో ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా స్పైస్‌జెట్ సైతం 12 3బోయింగ్ 737 మాక్స్2 విమానాలను గత మార్చి నెలలో నిలిపివేసింది. కాగా మరో 316 బోయింగ్ 737-800 ఎన్‌జీ2 ఎయిర్‌క్రాఫ్ట్‌ను తమ సంస్థ లీజు పద్ధతిలో నడపనుందని, ఇందుకోసం పౌర విమానయాన సంస్థ డైరెక్టరేట్ (డీజీసీఏ)కు దరఖాస్తు చేశామని, అక్కడి నుంచి నిరభ్యంతర సర్ట్ఫికెట్ రావాల్సివుందని, ఎన్‌ఓసీ అందిన వెంటనే విమానాలను దిగుమతి చేసుకుంటామని స్పైస్‌జెట్ ఓ ప్రకటనలో పేర్కొంది. డ్రై లీజు కింద లెస్సార్ ఎయిర్‌లైన్స్ తమకు ఎయిర్‌క్రాఫ్ట్‌ను అందజేస్తుందని, ఐతే అందులో ఎలాంటి సిబ్బందినీ ఇవ్వబోదని, ఆ తర్వాత వెట్ లీజు ద్వారా 3లెస్సార్2 పూర్తి స్థాయి సిబ్బందితో కూడిన విమానాన్ని తమ సంస్థకు అందజేస్తుందని ఆ ప్రకటన వివరించింది. ఇలావుండగా శుక్రవారం స్పైస్‌జెట్ వాటాల విలువ 2.11 శాతం పెరిగి ఒక్కో వాటాధర రూ.1,432.15కు చేరింది. జెట్ ఎయిర్‌వేస్ (ఇండియా) వాటా ధరలు మాత్రం ఎలాంటి ఎదుగూబొదుగూ లేకుండా బీఎస్‌ఈలో ప్లాట్‌గా కేవలం 0.02 శాతం వృద్ధితో ఒక్కో వాటా ధర 260.45గా ట్రేడయ్యాయి.