బిజినెస్

130 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తికి ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఆగస్టు 17: ఆంధ్రప్రదేశ్‌లో 2016-17 సీజన్‌కు సంబంధించి 130 మిలియన్ కిలోల పొగాకును ఉత్పత్తి చేసేందుకు పొగాకుబోర్డు ఆమోదం తెలిపింది. బుధవారం హైదరాబాద్‌లో బోర్డు చైర్మన్ మనోజ్‌కుమార్ ద్వివేది అధ్యక్షతన 142వ పొగాకు బోర్డు సమావేశం జరిగింది. సమావేశానికి బోర్డు సభ్యులు, ఎంపిలు గల్లా జయదేవ్, లాల్‌సింగ్ వదోడియా, స్పెషల్ చీఫ్ సెక్రటరీ (ఎపి) విజయకుమార్ తదితరులు హాజరయ్యారు. 2015-16 సీజన్‌లో దిగుబడి బోర్డు నిర్ణయించిన మేరకు రాకపోవడం, రైతులు నష్టాలు చవిచూడటంతో 2016-17లో 10 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తిని పెంచుతూ బోర్డు నిర్ణయం తీసుకుంది. అయతే రైతులు, రైతు ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు పంట ఉత్పత్తి పరిమాణాన్ని పెంచాలంటూ పలుమార్లు బోర్డు దృష్టికి తీసుకొచ్చిన నేపథ్యంలోనే తాజాగా జరిగిన బోర్డు సమావేశంలో నిరుడుతో పోలిస్తే 10 మిలియన్ కిలోలు పెరిగింది. కాగా, ఇప్పటివరకు బోర్డు సభ్యునిగా ఉన్న బాలినేని సీతయ్యను ఉపాధ్యక్షుడిగా నియమిస్తూ ఏకగ్రీవంగా బోర్డు ఆమోదించింది. ఈ సెప్టెంబర్‌తో ఉపాధ్యక్షుడు గద్దె శేషగిరిరావు పదవీ కాలం ముగుస్తుండంతో సీతయ్యను ఎన్నుకున్నారు.