బిజినెస్

వాణిజ్య ఉద్రిక్తతలతో ఆసియా వృద్ధికి విఘాతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్యాంకాక్, ఏప్రిల్ 13: అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు ఆసియా ప్రాంత ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతాయని, రానున్న రెండేళ్లలో ఆర్థిక వృద్ధి మందగించే అవకాశం ఉందని ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) ఇక్కడ విడుదల చేసిన ఒక నివేదికలో పేర్కొంది. ఆసియా ప్రాంతంలో ఆర్థిక వ్యవస్థ వృద్ధి కాస్త తగ్గుతుందని ఈ సంవత్సరం 5.7 శాతం, 2020లో 5.6 శాతం నమోదవుతుందని అంచనా వేసింది. 2017 ఆసియాలో ఆర్థిక వృద్ధి 6.2 శాతం నమోదయింది. ఆసియా ఆర్థిక వ్యవస్థ వృద్ధి కుంటుపడటానికి అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలే ప్రధాన కారణమని ఆ నివేదిక పేర్కొంది. వాణిజ్య విధానంలో తీవ్ర అనిశ్చితి కారణంగా ఆసియాలో పెట్టుబడులు, తయారీరంగం (మాన్యుఫాక్చరింగ్) కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం పడుతోందని వివరించింది. చైనా ఆర్థిక వ్యవస్థ వృద్ధి వేగంగా పడిపోవడం కూడా ఆసియా ఆర్థిక వ్యవస్థ వృద్ధి మందగించడానికి మరో కారణమని తెలిపింది. అమెరికా, చైనా మరోసారి ఈ వారంలో వాషింగ్టన్‌లో వాణిజ్య అంశాలపై చర్చలు జరపనున్న తరుణంలో ఈ నివేదిక విడుదలయింది.