బిజినెస్

నౌకా వాణిజ్యానికి ఊతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: నౌకావాణిజ్యం రంగంలో పరస్పర సహకారంతో ముందుకెళ్లాలని భారత్, ఏషియన్ దేశాలు నిర్ణయించాయి. 21 ఏషియన్-ఇండియా సీనియర్ అధికారుల సమావేశం గురు, శుక్రవారాలు ఇక్కడ జరిగింది. విదేశాంగ శాఖ (ఈస్ట్) కార్యదర్శి విజయ్ ఠాకూర్ సింగ్, థాయ్‌లాండ్ విదేశాంగ శాఖ కార్యదర్శి బుసాయా మథెలిన్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఏషియన్-్భరత్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య సంబంధాలు బలోపేతంపై విస్తృత చర్చలు జరిగాయి. భవిష్యత్‌లోనూ వ్యూహాత్మక భాగస్వామ్యంగా ముందుకెళ్లాలని ఉభయులు నిర్ణయించుకున్నారు. రాజకీయ- భద్రత, ఆర్థిక-సామాజిక, సంస్కృతిక రంగాల్లోనూ పరస్పర సహకారం ఉండాలన్నారు. అలాగే ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై విస్తృతంగా చర్చించినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ముఖ్యమంగా నౌకా వాణిజ్య రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించాయి.