బిజినెస్

కంపెనీల మోసాలపై సెబీ ప్రత్యేక దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: ఆర్థిక మోసాలకు పాల్పడుతున్న కంపెనీల భరతం పట్టడానికి సెక్యూరిటీస్ అండ్ ఎక్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) సమాయత్తమవుతున్నది. మార్కెట్ సెక్యూరిటీస్ చట్టాన్ని ఉల్లంఘించి మోసపూరితంగా వ్యవహరించే లిస్టెడ్ కంపెనీలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఉద్దేశపూర్వకంగా ఆర్థిక నేరాలకు పాల్పడే కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవడానికి వీలుగా అదనపు అధికారాలను ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని సెబీ కోరుతోంది. ప్రత్యేకించి కంపెనీల్లో తనిఖీలు నిర్వహించి అకౌంట్ పుస్తకాలను, ఆర్థిక లావాదేవీల వ్యవహారాలను తనిఖీలు చేసే ప్రత్యేక అధికారాలను సెబీ ఆశిస్తోంది. లేకపోతే, కంపెనీలు చేసే ఆర్థిక మోసాలకు అడ్డుకట్ట వేయడం కష్టమని అభిప్రాయపడుతున్నది. ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాల ప్రకారం, డాక్యుమెంట్లు, రికార్డుల్లో దిద్దుబాట్లు చేయడం లేదా వాటిని పూర్తిగా నాశనం చేయడం, తప్పుడు రికార్డులు సృష్టించడం లేదా తప్పుడు లెక్కలు చూపడం వంటి వ్యవహారాలకు కంపెనీలు పాల్పడినట్టు బయటపడిన సందర్భాల్లో ఆయా కంపెనీలకు అత్యధికంగా జరిమానాలను ప్రతిపాదించడం జరుగుతోంది. అలాగే చట్టపరమైన దర్యాప్తు జరపాలని సూచిస్తోంది. అలాగే అనుచిత వాణిజ్య వ్యవహారాలపై కొన్ని సందర్భాల్లో మోసపూరిత లేదా డొల్ల కంపెనీలకు వెళ్లి పరిస్థితులను పరిశీలించడం జరుగుతున్నది. కొన్ని సందర్భాల్లో మార్కెట్ భద్రతకు ముప్పు వాటిల్లే అంశాలపై మోసపూరిత కంపెనీల అకౌంట్లను కూడా పరిశీలిస్తోంది. అయితే, సెకూరిటీస్ చట్టానికి వ్యతిరేకంగా ఉన్న వివాదాస్పద ఫైళ్లు తనిఖీచేసే విషయంలో మరిన్ని విస్తృతాధికారాలను సెబీ కోరుతోంది. అలాగే చట్టాన్ని ఉల్లంఘించి ప్రభుత్వానికి నష్టం చేసిన మోసపూరిత కంపెనీల నుంచి అక్రమ మార్గాల్లో లాభాలు సంతరించుకున్న అనుబంధ సంస్థల నుంచి సైతం పరిహారం రాబట్టే విధంగా అధికారాలివ్వాలని కోరుతోంది. అదే విధంగా, ప్రస్తుతం వాడుకలో ఉన్న ’మెటీరియల్’ లేదా ‘బహిరంగ రహిత సమాచారం’ అనే పదాలకు బదులు ఇకపై ‘ప్రచురితం కాని ధరల సున్నిత సమచారం’గా మార్చాలని సెబీ సూచిస్తోంది. ప్రస్తుతం ఇన్‌సైడర్ ట్రేడింగ్ లేదా మోసపూరిత వాణిజ్యానికి సంబంధించి జరిగిన ఒప్పందాల్లో బహిర్గతం కాని అంశాల ఆధారంగానే సెబీ సంబంధిత కంపెనీలకు జరిమానాలు విధిస్తోంది. విచారణ నివేదికలను సవరించడం, నాశనం చేయడం వంటి చర్యలపై చట్టప్రకారం కనీసం 5 లక్షల రూపాయల వరకు జరిమానాను ప్రస్తుతం విధిస్తుండగా ఆ జరిమానా మొత్తాన్ని సైతం రూ. 10 కోట్లకు పెంచాలని సెబీ కోరుతోంది. కంపెనీల వాటా ధరలను నియంత్రించేలా రికార్డుల్లో మార్పులు చేసేందుకోసం ఏ కంపెనీ కూడా ప్రత్యేకంగా ఉద్యోగులను నియమించుకోకుండా మార్కెట్ సెక్యూరిటీస్ చట్టాన్ని సవరించాలని కూడా సూచించింది. ఇందువల్ల కంపెనీల వాటాదారుల్లో, సెక్యూరిటీ మార్కెట్లలో మదుపుచేసే ఇనె్వస్టర్లలో విశ్వాసాన్ని పెంచవచ్చని అంటున్నది. ప్రస్తుతం కంపెనీల చట్టం ప్రకారం అన్ని కంపెనీల్లో అకౌంట్ పుస్తకాలపై పర్యవేక్షణ, లేదా తనిఖీల ప్రాథమిక అధికారాలు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఉన్నాయి. తనకు సైతం మోసపూరిత కంపెనీలపై నేరుగా చర్యలు తీసుకునే అధికారం ఇవ్వాలని సెబీ కోరుతోంది. ఆర్థిక మోసాలు, ప్రత్యేకించి వివిధ కంపెనీలు ఉద్దేశపూర్వకంగానే వేల కోట్ల రూపాయలను బ్యాంకులకు ఎగవేసి, దివాలాను ప్రకటించడం లేదా ఆయా కంపెనీల యజమానులు, ప్రమోటర్లు విదేశాలకు పలాయనం చిత్తగించడం వంటి సంఘటనలు పెరుగుతున్నాయ. సెక్యూరిటీస్ చట్టంలో ఉన్న లొసుగులను ఆసరాగా తీసుకొని, కొన్ని కంపెనీలు యథేచ్ఛగా మోసాలకు పాల్పడుతున్నాయ. సరైన నిఘా లేకపోవడంతో, ఇలాంటి కంపెనీలు చేసిన మోసాలు చాలా ఆలస్యంగా వెలుగు చూస్తున్నాయ. సెబీ లేదా ప్రభుత్వం రంగంలోకి దిగి, విచారణ చేపట్టే సమయానికి జరగాల్సిన నష్టం జరిగిపోతున్నది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని సెబీ తనకు ఈ అంశాల్లో విస్తృతాధికారాలు ఇవ్వాలని కోరుతున్నది. ఈ ప్రతిపాదన సహేతుకమైనదేనని, సెబీ అధికారాలను పెంచుతూ, ప్రస్తుత చట్టాల్లో మార్పులు చేస్తే తప్ప లిస్టెడ్ కంపెనీల మోసాలకు తెరపడదని నిపుణులు అంటున్నారు. అయతే, సెబీ ప్రతిపాదనలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందా లేక వివిధ బడా కంపెనీలతో ఉన్న అవగాహన కారణంగా బుట్టదాఖలు చేస్తుందా అన్నది చూడాలి.