బిజినెస్

ఒడిదుడుకుల్లో స్టాక్ మార్కెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ), జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో ఈవారం మార్కెట్ ఒడిదుడుకుల మధ్య కొనసాగింది. ఈ అనిశ్చితి కొనసాగుతుందని విశే్లషకులు అనుమానిస్తున్నారు. వారం మొత్తాన్ని పరిశీలిస్తే, ఒక్కోసారి అద్భుత ఫలితాలతో బుల్ రన్ కొనసాగితే, ఒక్కోసారి సెనె్సక్స్, నిఫ్టీ అకస్మాత్తుగా పతనమై, బేర్ కేకలు వినిపించాయి. గత వారం లావాదేవీలకు చివరి రోజైన శుక్రవారం సెనె్సక్స్ 38,8882.23 పాయింట్ల వద్ద ముగిసింది. సోమవా రం నష్టాల్లో ట్రేడైన మార్కెట్ మరుసటి రోజు భారీ లాభాలను ఆర్జించింది. బుధవారం మళ్లీ నష్టాల్లో కొనసాగింది. గురువారం పరిస్థితి కొంత మెరుగైం ది. చివరి రోజైన శుక్రవారం సెనె్సక్స్ 38,767.11 పా యింట్ల వద్ద ముగిసింది. సోమవారం ట్రేడింగ్ మొ దలైనప్పటితో పోలిస్తే ఈవారం సెనె్సక్స్ పతనమైందని స్పష్టమవుతుంది. అయితే, దేశీయ మదుపరులు కొంత వరకు అండగా నిలవడంతో, సెనె్సక్స్ భారీ పతనం నుంచి కొంత వరకైనా బయటపడింది. మొత్తం మీద ఈవారం స్టాక్ మార్కెట్‌లో అనిశ్చితి నెలకొంది. వచ్చే వారం కూడా ఇదే పరిస్థితి ఉండవచ్చన్నది నిపుణుల అభిప్రాయం.