బిజినెస్

విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంచాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: తరగతి గదుల్లో సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంచాలే తప్ప తగ్గించే ప్రయత్నం చేయరాదని మైక్రోసాఫ్ట్ వరల్డ్‌వైడ్ ఎడ్యుకేషన్ వైస్-ప్రెసిడెంట్ ఆంథోని సాల్‌సిటో అన్నారు. అయితే విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించాల్సిన ఉపాధ్యాయులే తగ్గించే ప్రయత్నం చేయడం చాలా తప్పని ఆయన అభిప్రాయపడ్డారు. విద్యార్థులకు కేవలం పరికరాలు అందించి చేతులు దులిపేసుకుంటున్నారని ఆయన పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చి న ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. విద్య దేశ భవిష్యత్తుకు దిక్సూచి వంటిదని ప్రభుత్వాలు గుర్తించాయని ఆయన తెలిపారు. పారిశ్రామిక రంగంలో విప్లవాత్మకమైన మార్పులు సంభవిస్తున్నందున, విద్యార్థులను డిజిటల్ రంగం వైపు శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన పరికరాలను తగ్గించే ప్రయత్నాన్ని ఉపాధ్యాయులు చేయడం చాలా తప్పు అని, పూర్తిగా అసంబద్ధమైందని ఆయన విమర్శించారు. విద్యార్థులకు విద్యతో పాటు సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంపొందించాలని సాల్‌సిటో అన్నారు. ప్రతి విద్యార్థి మైండ్ సెట్ మార్చాల్సిన అవసరం ఉందన్నారు. తరగతి గదుల్లో తప్పని సరిగా ఇంటర్‌నెట్ సౌకర్యం కల్పించాలని ఆయన తెలిపారు. కొన్ని పాఠశాలలు విద్యార్థులకు ఇంటర్‌నెట్, సాంకేతిక పరికరాలు అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధంగా లేవని, డిజిటల్ పరికరాల కోసం పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావడం లేద ఆయన చెప్పారు. ఏ విద్యార్థులైతే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారో వారు అద్బుత ఫలితాలు పొందుతున్నారని ఆయన తెలిపారు. వివిధ దేశాలు ఇ2 విద్యను ప్రోత్సహిస్తున్నాయని ఆయన వివరించారు. గత వారం ప్యారిస్‌లో ఇ2 ఎడ్యుకేషన్ ఎక్చేంజ్ కాన్ఫరెన్స్ నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ప్రైవేటు, మున్సిపల్ పాఠశాలల్లో, గ్రామీణ పాఠశాలల్లో సాంకేతిక విద్యపై ఇచ్చిన శిక్షణకు అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయని ఆంథోని సాల్‌సిటో అన్నారు.