బిజినెస్

విదేశీ పెట్టుబడుల వెల్లువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: భారత ఈక్విటీ, రుణ మార్కెట్లలోకి ఈనెలలో విదేశీ పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయి. ప్రత్యేకించి విదేశీ పోర్టుపోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు) భారీగా మొగ్గుచూపుతున్నారు. ఈక్రమంలో ఈనెలలో ఇప్పటికే రూ. 11,096 కోట్ల రూపాయలు భారత కేపిటల్ మార్కెట్లలోకి పెట్టుబడులుగా వచ్చాయి. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు ఇందుకు దోహదం చేశాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. గత రెండు నెలల కాలంగా విదేశీ పోర్టుపోలియో ఇనె్వస్టర్లు అటు ఈక్విటీ, ఇటు రుణ మార్కెట్లలో అధిక మొత్తంలో వాటాలను కొనుగోలు చేశారు. ఈనేపథ్యంలో గడచిన ఫిబ్రవరి మాసంలో రూ. 11,182 కోట్లు పెట్టుబడులు రాగా మార్చిలో రూ.45,981 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. అంతకు ముందు జనవరిలో విదేశీ పోర్టుపోలియో ఇనె్వస్టర్లు రూ. 5,360 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకోవడం జరిగింది. డిపాజిటర్స్ గణాంకాల మేరకు ఈనెలలో 1 నుంచి 12వ తేదీ వరకు ఎఫ్‌పీఐలు రూ. 13,308.78 కోట్ల మొత్తాన్ని ఈక్విటీ మార్కెట్లలో మదుపు చేయగా, రూ. 2,212.08 కోట్ల మొత్తాన్ని రుణ మార్కెట్ల నుంచి వెనక్కు తీసుకున్నారు. గత ఫిబ్రవరి నుంచి ఈ రకమైన సానుకూలత కనిపిస్తోందని, ఇందుకు కారణం కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్న నమ్మకం అందరిలో బలపడటమేనని, మరోవైపుఅభివృద్ధి చెందిన దేశాల్లో ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశాలున్నాయన్న విశే్లషణలు సైతం భారత్‌లోకి విదేశీ ధనం వెల్లువలా రావడానికి దోహదం చేసిందని ఆర్థిక నిపుణుడు హర్ష్‌జైన్ అభిప్రాయపడ్డారు. అలాగే అంతర్జాతీయంగా సెంట్రల్ బ్యాంకులు సైతం తొందరపాటు నిర్ణయాలు చేయకుండా సమస్య పరిష్కారానికి అనువైన మార్గాలు అనే్వషించడం సైతం భారత్‌లో మార్కెట్లు సానుకూలతను సంతరించి పెట్టాయని ఆయన పేర్కొన్నారు. ద్రవ్య వినిమయ విధానంలో కూడా వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు మార్పులు చేసేందుకు చర్యలు చేపట్టాయని, ఐనా అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందాల విషయంలో వచ్చిన సానుకూల పరిణామాలు సైతం మదుపర్ల సెంటిమెంటును ప్రభావితం చేసిందని మరో విశే్లషకుడు హేమాంశు శ్రీవాత్సవ తెలిపారు. ఐతే ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌ను సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మార్చే అవకాశాలు లేకపోలేదని విశే్లషకులు అభిప్రాయపడుతున్నారు.