బిజినెస్

చంద్రన్న బీమాకు తొలి ప్రీమియం సర్కార్‌దే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఆగస్టు 17: చంద్రన్న బీమా పథకంలో నమోదైన అసంఘటిత కార్మికులకు అదనపు ప్రయోజనాలు వర్తించనున్నాయని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ కమిషనర్ డి వరప్రసాద్ తెలిపారు. అసంఘటిత రంగంలోని రెండు కోట్ల మంది కార్మికుల ప్రయోజనార్థం ప్రభుత్వం ప్రవేశపెట్టిన చంద్రన్న బీమా పథకంలో ప్రథమ ప్రీమియం రూ. 139 కోట్లు ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. రాష్ట్రంలో నిర్వహిస్తున్న ప్రజా సాధికార సర్వేలో ఇప్పటి వరకు 1.62 కోట్ల మంది అసంఘటిత కార్మికులు నమోదయ్యారని, వీరిలో 63 లక్షల మంది బీమా పథకంలో పేర్లు నమోదు చేసుకున్నారన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో బుధవారం జరిగిన కార్మిక శాఖ ప్రాంతీయ సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ నెలాఖరుకు ప్రజాసాధికార సర్వేలో అసంఘటిత కార్మికులను గుర్తించే ప్రక్రియ పూర్తవుతుందన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కార్మిక జన్మభూమి తేదీలను ఖరారు చేసి బీమా సర్ట్ఫికెట్లు అందజేస్తామన్నారు. నమోదైన కార్మికులకు యూనిక్ కోడ్ ఇచ్చామని, దాని ఆధారంగానే సర్ట్ఫికెట్ నెంబర్ కూడా వస్తుందన్నారు. చంద్రన్న బీమా క్లెయిముల పరిష్కార బాధ్యతను గ్రామీణ ప్రాంతాల్లో ‘సెర్ఫ్’కు, అర్బన్ ప్రాంతాల్లో ‘మెప్మా’కు అప్పగించామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆమ్ ఆద్మీ బీమా యోజన పథకం క్రింద 12 రూపాయలు చెల్లించాలన్నారు. ప్రధాన మంత్రి సురక్ష యోజన పథకం క్రింద ప్రీమియంను బ్యాంకులో చెల్లిస్తే సరిపోతుందన్నారు. వ్యాపార సంస్థలు కార్మిక శాఖలో తమ సంస్థల గురించి నమోదుకు ఆన్‌లైన్ విధానం ప్రవేశపెట్టామని కమిషనర్ వెల్లడించారు. సంబంధిత ఫీజును ఆన్‌లైన్‌లోనే చెల్లించి దరఖాస్తులో వివరాలను నమోదు చేస్తే సరిపోతుందని, అదే విధంగా తనిఖీ పోర్టల్ కూడా ఏర్పాటు చేశామని, ఈ విధానంలో అసిస్టెంట్ లేబర్ కమిషనర్ నుంచి కమిషనర్ వరకు ఏ అధికారి ఏ సంస్థలను తనిఖీ చేయాలో కంప్యూటర్‌లో నిక్షిప్తంచేసిన వివరాల ఆధారంగా తెలుస్తుందన్నారు. తనిఖీ వివరాలను 48 గంటల్లో సంబంధిత అధికారి పోర్టల్‌లో ఉంచాలని, అలాగే లోటుపాట్లను సరిచేసుకోవడానికి సంబంధిత సంస్థ యజమానికి 30 రోజుల గడువు ఇస్తామన్నారు. అసంఘటిత కార్మికులంతా చంద్రన్న బీమా పథకంలో నమోదయ్యేలా చూడటానికి జిల్లాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తామన్న ఆయన పథకం అమలుకు ఆరు జిల్లాల కార్మిక శాఖాధికారులకు దిశా నిర్దేశం చేశారు.