బిజినెస్

గణాంకాలే మార్కెట్లకు కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: రెండు సెలవు దినాలతో కూడుకున్న ఈ వారంలో ఈక్విటీ మారెట్లలో వాణిజ్య స్థితిగతులు ప్రధానంగా స్థూల ఆర్థికాభివృద్ధి గణాంకాలు, కార్పొరేట్ సంస్థల ఆదాయాలను అనుసరించి ఉంటాయని మార్కెట్ విశే్లషకులు అంచనా వేస్తున్నారు. స్టాక్ మార్కెట్లు బుధవారం మహావీర్ జయంతి, శుక్రవారం గుడ్ ఫ్రైడే సందర్భంగా మూతపడతాయి. ఈక్రమంలో టోకు ధరల సూచీ (డబ్ల్యుపీఐ) ద్రవ్యోల్బణానికి సంబంధించిన గణాంకాలు సోమవారం విడుదలవుతాయి. అలాగే గత శుక్రవారం నాడు విడుదలైన పారిశ్రామికాభృవృద్ధి గణాంకాలు, రీటైల్ ద్రవ్యోల్బణ వివరాలపై సైతం ఆధారపడి ఈక్విటీ సూచీలు కదలాడే అవకాశాలుంటాయని అంటున్నారు. ఐటీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్‌లు సైతం మార్చితో ముగిసిన తమ త్రైమాసిక గణాంకాలను వెలువరించడం జరిగింది. ఇక రాజకీయంగా సార్వత్రిక ఎన్నికల తీరుతెన్నులు, 2019 తొలి త్రైమాసిక గణాంకాలు స్వల్పకాలిక ప్రభావాన్ని చూపుతాయంటున్నారు. ఇక ఆదాయం విషయానికి వస్తే కార్పొరేట్ బ్యాంకులు బలహీనమైన పరిస్థితుల నుంచి లాభాల్లోకి వచ్చే వీలుందని, అలాగే విద్యుత్ కంపెనీలు సైతం ఆరోగ్యకరమైన ఆదాయాభివృద్ధిని సంతరించుకునే అవకాశాలున్నాయని ఇవి సెనె్సక్స్‌ను ప్రభావితం చెస్తాయని ప్రముఖ విశే్లషకుడు హేమాంగ్ జానీ అభిప్రాయపడ్డారు. ఇక ముడిచమురు ధరలు, రూపాయి మారకం విలువ, విదేశీ ఇనె్వస్టర్ల పెట్టుబడుల పరిస్థితులు ట్రేడింగ్ సెంటిమెంటును నిర్దేశిస్తాయని మరో విశే్లషకుడు వినోద్ నాయర్ తెలిపారు. ప్రపంచ మార్కెట్ల తీరుతెన్నులు కూడా ప్రస్తుత ఎన్నికల వేళ మనదేశీయ మార్కెట్లను ప్రభావితం చేస్తాయని, ఇనె్వస్టర్లలో విశ్వాసాన్ని ఇనుమడిస్తాయని ఆన్నారు. సార్వత్రిక ఎన్నికలకు రెండో విడత పోలింగ్ ఈ నెల 18న ఉన్న సంగతి తెలిసిందే. మే 23న 17వ లోక్‌సభ కొలువుదీరుతుంది. ఈక్రమంలో మార్కెట్లు గత శుక్రవారం సానుకూల పరిస్థితుల మధ్యే ముగిశాయి. గత శుక్రవారం వాణిజ్య వారం ముగింపు రోజున సెనె్సక్స్ 160.10 పాయిట్లు, నిఫ్టీ 46.75 పాయింట్లు లాభపడిన సంగతి తెలిసిందే. గురువారం అతిస్వల్ప ఆధిక్యతతో ప్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు శుక్రవారం సానుకూల పరిస్థితుల్లో ముగియడం గమనార్హం.