బిజినెస్

తగ్గిన బంగారం ధర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: ఈవారం మొదటి రోజునే బులియన్ మార్కెట్ నష్టాలను చవిచూసింది. 10 గ్రాముల బంగారం రూ.200 పతనమై రూ.32,620 చేరుకోగా, కిలో వెండి రూ.80 తగ్గడంతో రూ. 38,100 పడిపోయింది. బంగారం ధర తగ్గడం వరుసగా ఇది నాలుగో రోజు. దేశీయ డిమాండ్ తగ్గడంతోపాటు, అంతర్జాతీయ సూచీలు కూడా సానుకూలంగా లేకపోవడంతో బులియన్ మార్కెట్ దెబ్బతింటున్నది. షేర్ మార్కెట్ బలపడడం కూడా కొంత వరకూ బులియన్ మార్కెట్‌లో నష్టాలకు కారణమవుతున్నది. విదేశీ పెట్టుబడిదారులు కూడా బంగారం, వెండి కొనుగోళ్లపై ఆసక్తిని ప్రదర్శించడం లేదు. ఇలావుంటే, అంతర్జాతీయ బులియన్ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 1,287.10 డాలర్లకు పతనమైంది. అదే విధంగా వెండి కూడా నష్టాలను చవిచూడడంతో, ఔన్సు ధర 15.01 డాలర్లులకు చేరింది. ఈ వారం మొత్తం లాభనష్టాల మధ్య బులియన్ మార్కెట్ కొనసాగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.