బిజినెస్

‘ఇక జామీను ఆస్తి జప్తే’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 17: రుణాలు తీసుకున్నవారు వాటిని చెల్లించడంలో విఫలమైతే బ్యాంకులు ఇకపై ఎలాంటి జాప్యం చేయకుండా ఆ రుణాల కోసం జామీనుగా పెట్టిన ఆస్తులను స్వాధీనం చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన బిల్లుకు రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు బుధవారం అధికారులు తెలిపారు. అయితే వ్యవసాయ రుణాలకు ఇది వర్తించదు. అలాగే విద్యార్థుల రుణాలకూ చెల్లదు. ఆగస్టు 1న ఈ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలపగా, 9న రాజ్యసభ ఆమోదం పలికినది తెలిసిందే. బ్యాంకింగ్ రంగం.. ముఖ్యంగా ప్రభుత్వ బ్యాంకుల ఉనికిని మొండి బకాయిలు (నిరర్థక ఆస్తులు) ప్రశ్నార్థకం చేస్తున్న నేపథ్యంలో ఈ బిల్లు బ్యాంకులకు గొప్ప ఊరటనిచ్చింది. విజయ్ మాల్యా వంటి మొండి కార్పొరేట్లకు ఇక బ్యాంకులు చుక్కలు చూపిస్తాయన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.