బిజినెస్

పప్పు ధాన్యాల దిగుమతికి విధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొన్ని రకాల కాయధాన్యాల దిగుమతి కోసం ఒక విధానాన్ని రూపొందించింది. మిల్లర్ల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ కాయధాన్యాల మిల్లర్లు, రిఫైనర్లు దిగుమతుల కోసం లైసెన్సులు తీసుకోవలసిన అవసరం ఉందని వాణిజ్య మంత్రిత్వ శాఖలోని విదేశీ వాణిజ్య విభాగం డీజీఎఫ్‌టీ తెలిపింది. 32లక్షల టన్నుల కందులు, 1.5 లక్షల టన్నుల మినుములు, 1.5 లక్షల టన్నుల పెసర్లు, 1.5 టన్నుల బఠానీల దిగుమతికి విధానం రూపొందించడం జరిగింది2 అని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్‌టీ) ఒక నోటీసులో తెలిపింది. భారత్ తన దేశీయ అవసరాల కోసం ఏటా 4-6 మిలియన్ టన్నుల పప్పు ధాన్యాలను దిగుమతి చేసుకుంటోంది. ఈ ఏడాది దేశంలో పప్పు ధాన్యాలు బాగా ఉత్పత్తి కావడంతో దిగుమతుల పరిమాణంపై ప్రభుత్వం పరిమితులు విధించింది.