బిజినెస్

రూ.78,110 కోట్లకు చేరిన పీ-నోట్ పెట్టుబడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: మార్కెట్ సెంటిమెంట్ సానుకూలంగా ఉన్న తరుణంలో దేశీయ క్యాపిటల్ మార్కెట్‌లో పార్టిసిపేటరి నోట్స్ ద్వారా పెట్టుబడులు 2019 మార్చి చివరి నాటికి రూ. 78,110 కోట్లకు పెరిగాయి. రిజిస్టర్ చేసుకోకుండా భారత స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టాలని కోరుకునే విదేశీ ఇనె్వస్టర్లకు రిజిస్టర్ అయి ఉన్న ఫారిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు) పార్టిసిపేటరి నోట్స్ (పీ-నోట్స్)ను జారీ చేస్తాయి. సెబీ తాజా గణాంకాల ప్రకారం, ఇండియన్ మార్కెట్లలో (ఈక్విటి, డెబిట్, డెరివేటివ్స్) పీ-నోట్ పెట్టుబడుల మొత్తం విలువ 2019 మార్చి చివరి నాటికి రూ. 78,110 కోట్లకు పెరిగింది. ఫిబ్రవరి చివరి నాటికి ఇవి రూ. 73,428 కోట్లుగా ఉన్నాయి. క్యాష్ సెగ్మెంట్‌లో ఎఫ్‌పీఐల నుంచి నికరంగా పెట్టుబడుల రాక పెరగడం వల్ల అందుకు అనుగుణంగా పీ-నోట్స్ పెట్టుబడులు కూడా పెరిగాయి. 2019 ఫిబ్రవరిలో రూ. 13,500 కోట్లు ఉన్న ఎఫ్‌పీఐల నికర పెట్టుబడుల రాక మార్చి చివరి నాటికి రూ. 32,000 కోట్లకు పెరిగాయి’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ రీసెర్చ్ విభాగం హెడ్ వినోద్ నాయర్ పేర్కొన్నారు.