బిజినెస్

డాలర్ల కొనుగోలుదారుగా ఆర్బీఐ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 17: క్రమం తప్పకుండా డాలర్లను కొంటున్న క్లయింట్‌గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ముద్ర పడుతున్నది. తాజా విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో ఆర్బీఐ 825 మిలియన్ డాలర్లను స్పాట్ మార్కెట్‌లో కొన్నది. అంతకు ముందు డిసెంబర్, జనవరి మాసాల్లోనూ ఆర్బీఐ డాలర్లను కొన్నది. మొత్తం మీద ఏడాది కాలంలో ఆర్బీఐ ఏకంగా 2.086 బిలియన్ డాలర్లను స్పాట్ మార్కెట్‌లో కొనింది. 1.261 బిలియన్ డాలర్లను అమ్మింది. రూపాయి మారకపు విలువ క్రమం తప్పకుండా పతనం కావడంతో ఆర్బీఐ తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నది. గత ఏడాది డిసెంబర్‌లో 607 మిలియన్ డాలర్లను స్పాట్ మార్కెట్‌లో కొనుగోలు చేసింది. ఈడాది జనవరిలో డాలర్ నెట్ బయ్యర్‌గా ముద్రపడింది. ఆ నెలలో ఆర్బీఐ 293 మిలియన్ డాలర్లను కొనింది. మొత్తం మీద 1.025 బిలియన్ డాలర్లను కొని, 732 మిలియన్ డాలర్లను అమ్మింది. గత ఏడాది ఫిబ్రవరి నెలలోనూ డాలర్‌కు నెట్ బయ్యర్‌గా ఆర్బీఐ మారిం ది. 3.320 బిలియన్ డాలర్లను కొని, 1.655 డాలర్లను అమ్మింది. గత ఆర్థిఖ సంవత్సరంలో ఆర్బీఐ 33.689 బిలియన్ డాలర్లను స్పాట్ మార్కెట్‌లో కొన్నది. దీనితో మొత్తం కొనుగోళ్లు 52.068 బిలియన్ డాలర్లకు పెరిగింది.
2018 ఏప్రిల్ 13న ఆర్బీఐ చరిత్రలోనే అత్యధికంగా 426.028 బిలియన్ డాలర్ల నిల్వలు ఉన్నా యి. అయితే, రూపాయి మారకపు విలువ పతనం కావడంతోపాటు, చదువు, ఇతరత్రా కారణాలతో విదేశాలకు వెళుతున్న వారి కోసం భారీగా డాలర్లను ఖర్చు చేయాల్సి రావడంతో ఈ నిర్వలు క్రపంగా తగ్గుతున్నాయి.