బిజినెస్

92 శాతం పెరిగిన సోయామీల్ ఎగుమతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: దేశం నుంచి సోయామీల్ ఎగుమతులు ఏడాది కాలంలో దాదాపుగా రెట్టింపయ్యాయి. గత ఏడాది జనవరిలో 486.16 కోట్ల రూపాయల విలువైన సోయామీల్ ఎగుమతికాగా, ఈ ఏడాది జనవరిలో అది 933.75 కోట్ల రూపాయలకు చేరింది. సోయాబీన్ ఉత్పత్తులను ఆర్థిక సంవత్సరాల గణాంకాలతో పోలిస్తే, గత ఆర్థిక సంవత్సరంలో కొంత మెరుగ్గానే నమోదైంది. అయితే, 2012-13 ఆర్థిక సంవత్సరంతో పోల్చిచూస్తే మాత్రం చాలా తక్కువ. కాగా, వరుసగా నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో సోయామీల్ ఉత్పత్తులు పెరగడం గమనార్హం. 2011-12 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 9,938.97 కోట్ల రూపాయల సోయామీల్ ఎగుమతి జరిగింది. 2012-13లో, రికార్డు స్థాయిలో 14,155.97 కోట్ల రూపాయల విలువైన సోయామీల్‌ను ఎగుమతి చేశారు.
ఆతర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చింది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో 13,821.21 కోట్ల రూపాయల ఎగుమతులు జరగ్గా, 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఒక్కసారిగా 4,849.37 కోట్ల రూపాయలకు పతనమైంది. ఆ మరుసటి ఆర్థిక సంవత్సరం (2015-16)లో మరింతగా దిగజారి, కేవలం 1,520.20 కోట్ల రూపాయలు మాత్రమే సాధ్యమైంది. కానీ, 2015-16 ఆర్థిక సంవత్సరంలో కొద్దిగా కోలుకొని, 3,731.69 కోట్ల రూపాయలకు పెరిగింది. 2017-18లో పరిస్థితి మెరుగు పడడంతో, 5,130.42 కోట్ల రూపాయల విలువైన సోయామీల్ ఎగుమతులు సాధ్యమయ్యాయి. గత ఆర్థిక సంవత్సరంలో మరికొంత వృద్ధి నమోదు కాగా, 5,983.18 కోట్ల రూపాయలకు పెరిగింది.