బిజినెస్

లాభాల బాటలో టీవీ 18

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: టీవీ 18 బ్రాడ్‌కాస్టింగ్ లిమిటెడ్ లాభాల బాటలో పయనిస్తున్నది. గత ఆర్థిక సంవత్సరం 29.9 కోట్ల రూపాయల నికర లాభాన్ని ఆర్జించినట్టు ప్రకటించింది. ఆదాయాన్ని 1,196.55 కోట్ల రూపాయలుగా తన నివేదికలో పేర్కొంది. మీడియా, ఎంటర్టెన్మైంట్ రంగంలో వ్యాపారం నిర్వహిస్తున్న టీవీ 18 మార్చి 31వ తేదీతో ముగిసిన చివరి త్రైమాసికంలో 765.12 కోట్ల రూపాయల ఆదాయం, 4.67 కోట్ల రూపాయల నికర లాభాన్ని నమోదు చేసినట్టు వివరించింది. ఇటీవలే వియాకామ్ 18 మీడియా ప్రైవేట్ లిమిటెడ్, ఇండియాకాస్ట్ మీడియా డిస్ట్రిబ్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలను విలీనం చేసుకున్న కారణంగా గత ఏడాది లాభనష్టాలు, ఇతరత్రా అంశాల ఆధారంగా తమ కంపెనీని పోల్చడానికి వీల్లేదని వ్యాఖ్యానించింది. కొంత కాలంగా ప్రసార రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చిన కారణంగా, బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీలకు విస్తృత పరిధిలో అవకాశాలు లభిస్తున్నాయని టీవీ 18 చైర్మన్ అదిల్ జయినుల్‌భాయ్ వ్యాఖ్యానించారు. కాగా, బీఎస్‌ఈలో టీవీ 18 షేర్లు 36.70 రూపాయల ధరతో ట్రేడ్ అవుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం పూర్తయ్యేలోగా కంపెనీ లాభాలతోపాటు, షేర్ల విలువ కూడా పెరుగుతుందని మార్కెట్ నిపుణుల అంచనా.