బిజినెస్

జెట్ ఎయిర్‌వేస్ మూత!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న జెట్ ఎయిర్‌వేస్ మూతపడే పరిస్థితి కనిపిస్తున్నది. ఒకప్పుడు వందకు పైగా ఉన్న విమానాల సంఖ్య ఇప్పుడు 12కు చేరుకుంది. పైలట్లు, ఇంజనీర్లు, ఇతర సిబ్బందికి కూడా జీతాలు చెల్లించలేకపోతున్న ఈ సంస్థ ఆర్థిక సాయం కోసం ఎస్‌బీఐని ఆశ్రయించింది. ఉద్యోగులు కూడా యాజమాన్యానికి మద్దతు పలుకుతూ, రూ.1,500 కోట్ల తక్షణ రుణాన్ని మంజూరు చేయాలని ప్రధాన రుణదాత ఎస్‌బీఐకి విజ్ఞప్తి చేశారు. జెట్ ఎయిర్‌వేస్ మూత పడితే సుమారు 20వేల మంది ఉద్యోగులు వీధినపడతారని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, తక్షణ సాయం కింద రూ.400 కోట్లిస్తే తాత్కాలికంగా సమస్య నుంచి బయటపడే అవకాశం లభిస్తుందని యాజమాన్యం చేసిన విజ్ఞప్తిని రుణదాతల కమిటీ తిరస్కరించినట్టు సమాచారం. బుధవారం జరిగిన సమావేశంలో జెట్ ఎయిర్‌వేస్ అభ్యర్థనపై ఎక్కువ మంది సభ్యులు సానుకూలంగా స్పందించలేదని తెలుస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం నిజమైతే జెట్ ఎయిర్‌వేస్ త్వరలోనే మూతపడక తప్పదు.