బిజినెస్

పైకెగసి పతనమైన మార్కెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 18: స్టాక్ మార్కెట్‌లో ఎప్పుడు, ఏం జరుగుతుందో ఊహించడం కష్టమని మరోసారి రుజువైంది. గురువారం నాటి మార్కెట్ ట్రెండ్స్ సానుకూల ధోరణుల మధ్య ప్రారంభమై, ఒకానొక దశలో గతంలో ఎన్నడూ లేనంత అత్యధిక పాయింట్లకు చేరుకున్నప్పటికీ, ఆతర్వాత అనూహ్యంగా పతనమై, చివరికి నష్టాల్లో ముగిసింది. రికార్డు స్థాయి సెనె్సక్స్ పాయింట్లు నమోదవుతాయన్న పరిశీలకుల అంచనాలు తారుమారయ్యాయి. బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో 135.36 పాయింట్లు (0.34 శాతం) పతనమైన సెనె్సక్స్ చివరికి 29,140.28 పాయింట్ల వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో నిఫ్టీ 34.35 పాయింట్లు (0.29 శాతం) పడిపోవడంతో 11,752.80 పాయింట్లకు చేరింది. 39,275.64 పాయింట్లతో మొదలైన లావాదేవీలు ఆరంభం నుంచే లాభాల బాట పట్టాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులతోపాటు దేశీయ మదుపరులు కూడా ఆసక్తిని ప్రదర్శించడంతో సెనె్సక్స్ పాయింట్ల సూచీ వేగాన్ని పుంజుకుంది. ఒకానొక దశలో, గతంలో ఎన్నడూ లేనిరీతిలో 39,420.04 పాయింట్లకు చేరింది. ఇదే సూచీ వద్ద మార్కెట్ స్థిరంగా కొనసాగితే, బీఎస్‌ఈ చరిత్రలోనే అత్యధిక పాయింట్ల సెనె్సక్స్ నమోదై ఉండేది. కానీ, మార్కెట్ ట్రెండ్స్ అనుకోకుండా ప్రతికూల ధోరణులను ఎదుర్కోవాల్సి వచ్చింది. శరవేగంగా పతనమైన సెనె్సక్స్ ఒకానొక దశలో 39,083.16 పాయింట్లకు పడిపోయింది. చివరిలో దేశీయ పెట్టుబడిదారులు ఆదుకోవడంతో కొంత మేరకు కోలుకొని, 39,140.28 పాయింట్లకు చేరగలిగింది. నిఫ్టీ కూడా ఆరంభంలో మెరుగైన ఫలితాలను నమోదు చేసినప్పటికీ, ఆతర్వాత దారుణంగా పతనమైంది. చివరికి 34.35 పాయింట్ల స్వల్ప నష్టంతో బయటపడింది. బీఎస్‌ఈలో గురువారం భారీగా నష్టపోయిన కంపెనీల జాబితాలో ఎస్ బ్యాంక్ అగ్రస్థానంలో ఉంది. ఈ బ్యాంక్ వాటాలు 4.18 శాతం పతనమయ్యాయి. వేదాంత 3.51 శాతం, ఇండస్‌ఇండ్ 2.86 శాతం, టాటా స్టీల్ 1.60 శాతం, ఎల్ అండ్ టీ 1.57 శాతం చొప్పున నష్టాలను చవిచూశాయి. అయితే, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (రిల్) ప్రతికూల వాతావరణాన్ని తట్టుకొని నిలబడింది. ఈ కంపెనీ షేర్లు 2.79 శాతం లాభాలను ఆర్జించాయి. టాటా మోటార్స్ 2.32 శాతం, ఏషియన్ పెయింట్స్ 0.77 శాతం, టీసీఎస్ 0.61 శాతం, కోల్ ఇండియా 0.22 శాతం చొప్పున లాభాలను సంపాదించాయి. కాగా, ఎన్‌ఎస్‌ఈ ట్రేడింగ్‌లో ఇండియాబుల్స్ అత్యధికంగా, 4.44 శాతం నష్టపోయింది. ఎస్ బ్యాంక్ 4.09 శాతం, హిందాల్‌కో 3.70 శాతం, వేదాంత 3.54 శాతం, ఇండస్‌ఇండ్ 3.17 శాతం చొప్పున నష్టపోయాయి. కాగా, బీఎస్‌ఈలో మాదిరిగానే ఎన్‌ఎస్‌ఈలోనూ రిలయన్స్ ఎక్కువ లాభపడింది. ఈ కంపెనీ షేర్లు 3.15 శాతం లాభాలు ఆర్జించాయి. జెఎస్‌డబ్ల్యూ స్టీల్ 2.88 శాతం, టాటా మోటార్స్ 2.30 శాతం, బీపీసీఎల్ 1.52 శాతం, విప్రో 1.30 శాతం చొప్పున లాభాలను నమోదు చేశాయి. ఇలావుంటే, ఆసియా మార్కెట్లను పరిశీలిస్తే, జపాన్, చైనా, కొరియాల్లోనూ నష్టాలు తప్పలేదు.