బిజినెస్

అటవీ ఉత్పత్తులతో పౌష్టికాహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: పలు రకాలైన అటవీ ఉత్పత్తులకు దేశీయ మార్కెట్‌లో డిమాండ్‌ను పెంచుతున్న గిరిజన సహకార సంస్థ (జీసీసీ) మరో అడుగు ముందుకేసింది. తొలిసారి అటవీ ఉత్పత్తులతో పౌష్టికాహారం తయారీపై దృష్టిసారిస్తోంది. అధిక సంఖ్యలో ఇప్పటికే పలు రకాలైన అటవీ ఉత్పత్తులతో పౌష్టిక విలువలతో కూడిన ఆహార పదార్ధాలను అందుబాటులోకి తీసుకురావాలని జీసీసీ లక్ష్యంగా పెట్టుకుంటుంది. ఇందుకోసం స్వచ్చంద సేవా సంస్థలను ప్రోత్సహించాలని నిర్ణయించింది. దీనివల్ల నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడటం, దళారీ వ్యవస్థ లేకుండా చేస్తూనే మరోపక్క స్వచ్చంద సేవా సంస్థల ద్వారా అటవీ ఉత్పత్తులతో పౌష్టికాహారాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్టు అవుతుందని జీసీసీ భావిస్తోంది. తొలుత ఎటువంటి రసాయనాల మిశ్రమం లేని సంపూర్ణ ఆరోగ్యకరమైన, నూరు శాతం పౌష్టికాహారం కలిగి ఉండే రాగులు, జొన్నలు, సామలు, కొర్రలను గిరిజనులు అత్యధిక శాతంలో పండించే విధంగా జీసీసీ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఈ ఉత్పత్తుల తయారీ, అమ్మకానికి ఆంధ్ర రాష్ట్రంలో పలు జిల్లాల స్వచ్చంద సేవాసంస్థలను ప్రోత్సహించాలని జీసీసీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే విశాఖ జిల్లా పాడేరు, అరకు, విజయనగరం జిల్లా పరిధిలో పార్వతీపురం, గుమ్మలక్ష్మీపురం, శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి, సీతంపేట, ఖమ్మం, చిత్తూరు తదితర జిల్లాల్లో గిరిజన ప్రాంతాల నుంచి అటవీ ఉత్పత్పులను సేకరించి పౌష్టిక విలువలతో కూడిన ఆహార పదార్ధాలను అందుబాటులోకి తీసుకువచ్చేలా స్వచ్చంధ సంస్థలను ప్రోత్సహిస్తోంది. పలు జిల్లాల నుంచి ఇప్పటికే ఆయా స్వచ్చంద సంస్థల ద్వారా పౌష్టిక ఆహార పదార్ధాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇందులో అత్యధిక పోషక విలువలు కలిగి ఉండే రాగులు, జొన్నలు, కొర్రలతో తయారుచేస్తున్న బిస్కట్లు అందుబాటులోకి వచ్చాయి. వీటిని ప్రత్యేక ప్యాకేజీలుగా తయారుచేసి కనీసం ధర రూ.65లుగా నిర్ణయించి మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. వీటికి వినియోగదారుల నుంచి విశేష ఆదరణ లభించడంతో ఇప్పుడు జీసీసీ ప్రత్యేక కౌంటర్లు, స్టాల్స్ ద్వారా, డిస్ట్రిబ్యూటర్లను నియమించడం ద్వారా పూర్తిస్థాయిలో పట్టణ, మున్సిపాలిటీల పరిధిలో విక్రయాలు జరిపి వీటిని విస్తృతపర్చాలని జీసీసీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విధానంతోపాటు ఎలాగైనా దేశీయ మార్కెట్‌లోకి అడుగుపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
రాగులు, జొన్నలను పిండిగా చేసి కాస్తంత నెయ్యి, జీలకర్రను మిశ్రమంగా ఉపయోగించి మల్టీ విటమిన్స్ పేరిట బిస్కట్ డబ్బాలను జీసీసీ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ తరహా ఆహార పదార్ధాలను మార్కెట్‌లోకి విడుదల, తరువాత దశలవారీగా వర్క్‌షాప్‌లు, సదస్సులు, వివిధ ప్రచారమాధ్యమాల ద్వారా జాతీయ మార్కెట్‌లోకి తీసుకువెళ్ళాలని జీసీసీ భావిస్తోంది. ముఖ్యంగా రక్తహీనత కలిగిన రోగులకు పోషక విలువలు అత్యధికంగా కలిగిన రాగి బిస్కట్లను ఆహారంగా తీసుకుంటే చక్కటి ఫలితాలను ఇస్తాయని నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలిక రోగాల నుంచి కాస్తంత ఉపశమనం కలుగుతుంది.
జీఎస్‌టీ దెబ్బ..
అటవీ ఉత్పత్తులతో పౌష్టికాహారాన్ని అందుబాటులోకి తీసుకువచ్చే స్వచ్చంద సేవా సంస్థలను ప్రోత్సాహించడం, ఉపాధి అవకాశాలను మెరుగుపర్చడం, స్వయం సహాయక సంఘాల ఆర్ధిక పరిపుష్టికి తోడ్పడుతున్న జీసీసీకి జీఎస్‌టీ వలన గట్టి దెబ్బ తగులుతోంది. ఏ విధమైన లాభసాటిగా లేకుండానే మార్కెట్‌లో వినియోగదారునికి అందించాల్సి వస్తోంది. కేవలం రూ.65ల విలువైన మల్టీ విటమిన్ డబ్బాను విక్రయించడం ద్వారా దాదాపు తొమ్మిది రూపాయల వరకు జీఎస్‌టీ రూపంలో చెల్లించాల్సి వస్తోంది. ఆయా సంస్థల నుంచి జీసీసీకి రూ.45లకు తక్కువ లేకుండా వస్తోంది. దీనిని ఏపీలో పలు జిల్లాల నుంచి ఇక్కడి జీసీసీకి తీసుకువచ్చేసరికి నిర్వహణ, రవాణాచార్జీలుగా ఐదు నుంచి ఏడు రూపాయల వరకు వెచ్చించాల్సి ఉంటుందని సంస్థ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.