బిజినెస్

జెట్ బోయింగ్ విమానాల లీజుపై ఎస్‌బీఐ చైర్మన్‌తో భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 19: ప్రస్తుతానికి మూతపడిన జెట్ ఎయిర్‌వేస్ సంస్థకు చెందిన ఐదు బోయింగ్ విమానాలను లీజుకు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్న జాతీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా చైర్మన్ అశ్వినీ లోహానీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ రజనీష్‌కుమార్‌తో సమావేశమై చర్చించనున్నారు. జెట్ ఎయిర్‌వేస్ సంస్థ ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం అధీనంలో ఉన్న సంగతి తెలిసిందే. పీకల్లోతు అప్పులు, కష్టాల్లో కూరుకుపోయి, ఏమాత్రం ఆదాయ మార్గాలు లేని పరిస్థితుల్లో జెట్ ఎయిర్‌వేస్ ఆఖరుకు నడుపుపుతున్న ఏడు విమానాలను సైతం ఆపివేస్తున్నట్టు గురువారం రాత్రి ప్రకటించిన సంగతి తెలిసిందే. వీటితోబాటే పది బోయింగ్ 777-300 విమానాలు, ఆరు ఎ 300 ఎయిర్ బస్‌ల నిర్వహణను ఆ సంస్థ్ధ ఆపివేసింది. ఈ క్రమంలో ఎయిర్ ఇండియా చైర్మన్ ఎస్‌బీఐ చైర్మన్‌కు గురువారం రాశారు. జెట్ ఎయిర్‌వేస్ నడుపుతున్న ఐదు బోయింగ్ 777 విమానాలను లీజుకు తీసుకుని నడిపేందుకు ఆ లేఖలో ఎయిర్ ఇండియా చైర్మన్ అశ్వినీ లోహానీ సంసిద్ధత వ్యక్తం చేయడం జరిగింది. కీలకమైన అంతర్జాతీయ మార్గాల్లో ఈ విమానాలను నడిపేందుకు ఎయిర్ ఇండియా యోచిస్తోంది. ఈక్రమంలో ఢిల్లీలో ఇద్దరు చైర్మన్లు సమావేశమై చర్చిస్తారని తెలుస్తోంది. ఐతే శుక్రవారం పొద్దుపోయాక జరగాల్సిన ఈ సమావేశంపై స్పష్టత ఇవ్వడానికి సంబంధిత వైమానిక సంస్ధకు చెందిన విశ్వసనీయ అధికారులెవరూ అందుబాటులో లేరు. ఇలావుండగా తమ విమానాల ఫ్రీక్వెన్సీలను పెంచుకుని పలు అంతర్జాతీయ రూట్లలో అదనంగా విమానాలు నడపాలని ఎయిర్ ఇండియాప్రణాళికలు సిద్ధం చేసిందని తెలిసింది. ఈక్రమంలో డ్రై లీజు పద్ధతిలో తీసుకునే విమానాలకైతే సిబ్బంది రహితంగా విమానాలను మాత్రమే లీజుకు ఇస్తారు. అదే వెట్ లీజు ప్రకారం అయితే విమానాలను సిబ్బందితో ఇవ్వాల్సివుంటుంది. అలాగే నిర్వహణ, ఇన్సూరెన్స్ సదుపాయాలను సైతం కల్పించాల్సి ఉం టుంది. ఇలావుండగా జెట్ ఎయిర్‌వేస్ విమానాల నిర్వహణను పూర్తిగా ఆపివేయడంతో ప్రస్తుతం ఎయిర్ ఇండియా ఒక్కటే మన దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి సుదూర, అతి సుదూర మార్గాల్లో విమానాలను నడుడుపుతోంది.