బిజినెస్

20 శాతం వార్షిక వృద్ధిని ఆశిస్తున్న గోద్రెజ్ గృహోపకరణాల విభాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 19: గృహోపకరణాల వాణిజ్య దిగ్గజం గోద్రెజ్ గ్రూప్‌లోని వినిమయ వస్తువుల విభాగం ‘గోద్రెజ్ అప్లియెనె్సస్’ 20 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసింది. రూ. 5,200 కోట్ల ఆదాయ లక్ష్యానికి ఈ సంస్థ చేరువైంది. ముంబయి నగరం ప్రధాన కేంద్రంగా నడుస్తున్న ఈ సంస్థ గత ఆర్థిక సంవత్సరంలో రూ. 4,300 కోట్ల ఆదాయా న్ని ఆర్జించింది. ఆ ఏడాది ఏసీలు, వాషిం గ్ మిషన్లు వ్యాపారంలో తగ్గుదల నెలకొంది. అయితే ఈ సంవత్సరం అది గణనీయంగా పెరుగుతుందని అంచనా వేస్తున్నట్టు గోద్రేజ్ అప్లియెనె్సస్ ఎగ్జిక్యూటివ్ వైస్‌ప్రెసిడెంట్ కమల్ నంది పీటీఐకి తెలిపారు. వచ్చే మూడేళ్ల కాలంలో 7,500 నుంచి 8000 కోట్ల రూపాయల ఆదాయాన్ని గడించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుందని ఆయన వివరించారు. ఈవేసవిలో తమ సంస్ధ ఉత్పత్తుల విక్రయా లు గత ఏడాదికంటే పెరుగుతాయని, ప్రధానంగా కూలింగ్ కేటగిరీలో మంచి వృద్ధి నమోదవుతుందని ఆశిస్తున్నట్టు తెలిపా రు. ప్రస్తుతం గోద్రెజ్ అప్లియెనె్సస్‌కు దేశ వ్యాప్తంగా 16వేల రీటెయిల్ ఔట్‌లెట్లు ఉన్నాయని, మరో వంద ప్రత్యేక విక్రయ కేంద్రా లు, వంద ప్రాధాన్యత గల విక్రయ కేంద్రా లు (ఔట్‌లెట్లు) ఉన్నాయని కమల్ నంది వివరించారు. ప్రత్యేక విక్రయ కేంద్రాలను ద్విగుణీకృతం చేసే యోచనలో ఉన్నామని, అలాగే ప్రాధాన్యత గల ఔట్‌లెట్లను సైతం వెయ్యికి పెంచాలని నిర్ణయించామని తెలిపారు. ఆన్‌లైన్ విక్రయాల్లో సైతం మొత్తం మార్కెట్‌లో 5 నుంచి 7 శాతం తమ కంపెనీ భాగస్వామ్యం ఉందన్నారు. అలాగే ఏసీల విక్రయంలో సైతం 6 మిలియన్ యూనిట్ల విక్రయం ద్వారా 4 శాతం మార్కెట్ షేర్‌ను కైవసం చేసుకున్నామని తెలిపారు.