బిజినెస్

అంతు చిక్కని గమనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 20: స్టాక్ మార్కెట్‌లో అనిశ్చితి కొనసాగుతున్నది. ఫలితంగా మార్కెట్ గమనం ఎవరికీ అంతుచిక్కడం లేదు. ప్రస్తుత పరిస్థితికి ఉదాహరణగా గురువారం నాటి ట్రేడింగ్‌ను తీసుకోవచ్చు. బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో లావాదేవీలు మొదలైన మరుక్షణం నుంచే అసాధారణగా పెరిగిన సెనె్సక్స్ పాయింట్లు ఒకానొక దశలో 39,487.45 పాయింట్లకు చేరాయి. బీఎస్‌ఈ చరిత్రలోనే సెనె్సక్స్ సూచీ ఇంత భారీగా నమోదు కాలేదు. కానీ, ఆతర్వాత అనూహ్యంగా పతనమయ్యాయి. 135.36 పాయింట్లు పడిపోయిన సెనె్సక్స్, చివరికి 39,140.28 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా 34.35 పాయింట్లు తగ్గడంతో, 11,752.80 పాయింట్ల వద్ద ముగిసింది. స్టాక్ మార్కెట్ ఏ దిశగా వెళుతున్నదో, ఎప్పుడు లాభాల్లో పరుగులు తీస్తుందో, ఎప్పుడు నష్టాలను మూటగట్టుకుంటుందో కనీసం ఊహకు కూడా అందడం లేదన్నది వాస్తవం. ఈవారం మొత్తం మీద కేవలం మూడు రోజులు మాత్రమే వ్యాపార లావాదేవీలు జరిగాయి. గత వారం శుక్రవారం 38,767.11 పాయింట్ల వద్ద ముగిసిన సెనె్సక్స్, సోమవారం 38,905.84 పాయింట్లకు పెరిగింది. మంగళవారం ఇదే దూకుడును కొనసాగిస్తూ, 39,275.64 పాయింట్లకు చేరింది. మహీవీర్ జయంతి కారణంగా బుధవారం స్టాక్ మార్కెట్‌కు సెలవు. గురువారం నాటి ట్రేడింగ్‌లో అనూహ్య ఫలితాలు వెల్లడికావడం, అత్యధిక పాయింట్లకు ఎగబాకి, ఎవరి అంచనాలకూ అందని రీతిలో పతనం కావడం మార్కెట్ పరిస్థితికి అద్దం పడుతుంది. లావాదేవీలు జరిగిన మూడు రోజుల్లో మార్కెట్ వరుసగా రెండు రోజులు లాభాలు నమోదుకాగా, ఒక రోజు నష్టాల్లో ముగిసింది.