బిజినెస్

‘జెట్’ ఉద్యోగులకు ఊరట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి, మూతపడిన జెట్ ఎయిర్‌వేస్‌లో పని చేస్తున్న ఉద్యోగులకు స్పైస్ జెట్ రూపంలో కొంత వరకూ ఊరట లభించనుంది. జెట్ ఎయిర్‌వేస్‌కు చెందిన వందకుపైగా పైలట్లు, కేబిన్ ఉద్యోగులు, ఇతరత్రా సిబ్బందిని తమ సంస్థలోకి తీసుకోనున్నట్టు స్పైస్ జెట్ చేసిన ప్రకటన ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది. అధ్యక్షుడు రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకోవాలని, వేలాది కుటుంబాలు రోడ్డున పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని జెట్ ఎయిర్‌వేస్ ఉద్యోగులు ముంబయిలోని సంస్థ ప్రధాన కార్యాలయం, న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ధర్నాలు నిర్వహించి, విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. కేంద్రం నుంచి ఎలాంటి స్పష్టత ఇంకా రాలేదు. ఇలావుంటే, పైలట్లు, ఇతర సిబ్బందిలో కొంత మందిని తాము తీసుకుంటామని తెలిపింది. జెట్ ఎయిర్‌వేస్‌లో సుమారు 23,000 మంది పని చేస్తుండగా, కనీసం కొంతమందికైనా ఉపాధిని ఇవ్వడానికి స్పైస్ జెట్ ముందుకు రావడం హర్షణీయం. దేశీయంగా వివిధ ప్రాంతాల్లో నడిపించేందుకు 24 కొత్త విమానాలను ప్రవేశపెడుతున్నట్టు స్పైస్ జెట్ ఇప్పటికే ప్రకటించింది. అందులో భాగంగానే జెట్ ఎయిర్‌వేస్ ఉద్యోగుల్లో కొందరికి అవకాశం కల్పించనుంది. ఈ సంస్థలో ఇప్పటికే వంద మందికిపైగా పైలట్లు, రెండు వందల మందికిపైగా కేబిన్ ఉద్యోగులు, రెండు వందలకుపైగా టెక్నికల్, ఎయిర్‌పోర్ట్ స్ట్ఫా పని చేస్తున్నారు. క్రమంగా తమ పరిధిని, సేవలను విస్తరించుకుంటూ వెళుతున్న స్పైస్ జెట్, తాజాగా కొత్త విమానాలను ప్రవేశపెట్టడంతో కొంత మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.