బిజినెస్

ఆర్బీఐకి రూ.3 లక్షల కోట్ల అదనపు మూలధన నిల్వలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: రిజర్వు బ్యాంకుకు అదనంగా రూ. 3లక్షల కోట్ల మూలధన నిల్వలున్నాయని బిమల్ జలాన్ కమిటీ తేల్చిచెప్పే అవకాశాలున్నాయి. ఆర్బీఐ వాస్తవిక మూలధన నిల్వలను నిగ్గుదేల్చేందుకు బిమల్ జలాన్ కమిటీ ఏర్పాటైన సంగతి తెలిసిందే. కాగా ఆర్బీఐలో అత్యవసర ఖర్చుల నిమిత్తం కేటాయించిన నిధులను, రీ వాల్యుయేషన్ నిధుల నిల్వలను కూడా ఈ అదనపు నిధుల జాబితాలో బిమల్ జలాన్ కమిటీ చేర్చినట్టు అమెరికాకు చెందిన బ్యాంకు మెర్రిల్ లించ్ నిర్వహించిన అధ్యయన నివేదిక సోమవారం నాడిక్కడ వెల్లడించింది. బిమల్ జలాన్ కమిటీ రిజర్వు బ్యాంకు మూలధన నిల్వలపై పూర్తి స్థాయి నివేదికను ఇప్పటికే సిద్ధం చేసిందని మెర్రిల్ లించ్ స్పష్టం చేసింది. గత సెప్టెంబర్ నెల చివరి నాటికి సెంట్రల్ బ్యాంక్ మూలధన అదనపు నిల్వలు రూ. 9.6 లక్షల కోట్లు ఉన్నాయి. ఐతే మా నిశితమైన పరిశీలనలో ఆర్బీఐకి ఒకటి నుంచి 3లక్షల కోట్ల అదనపు మూలధన నిల్వలున్నాయని వెల్లడైందని ఆ నివేదిక పేర్కొంది. అత్యవసర ఖర్చుల కోసం కేటాయించిన నిల్వలను ప్రస్తుతం ఉన్న 6.5 శాతం నుంచి 3.25 శాతానికి పరిమితం చేస్తే దాదాపు రూ.1,282 కోట్ల రూపాయలు మిగులుతాయని ఆ నివేదిక సూచించింది. ఈ నిల్వలు బ్రిక్స్‌గ్రూపింగ్‌లోని సెంట్రల్ బ్యాంకులతో పోలిస్తే 50 శాతం అదనంగా ఉన్నాయని నివేదిక తేల్చింది. అలాగే లాభాల రాబడి అంచనాలను సైతం 4.5 శాతం నుంచి 9 శాతానికి పెంచితే మరో రూ.1,170 కోట్లు మిగులు ఏర్పడుతుందని నివేదిక సూచించింది. మొత్తం నిల్వలను 20 శాతానికంటే మించకుండా చూస్తే (ప్రస్తుతం ఈ నిల్వల శాతం 25.5గా ఉంది) మరో రూ. 1.96 లక్షల కోట్ల రూపాయలు మిగులుతాయని తెలిపింది. ఈ మొత్తం నిల్వలు గతంలో 2004లో ఉషాతొరాట్ కమిటీ చేసిన సిఫార్సులు 18 శాతం కంటే, 2018లో జరిగిన ఆర్థిక సర్వే సూచించిన 16 శాతం కంటే అధికంగా ఉన్నాయని అధ్యయన నివేదిక తేల్చింది. అలాగే ఆర్బీఐ ఈ అదనపు నిధులను ప్రభుత్వానికి బదిలీ చేయడంపై ఎలాంటి ఆంక్షలూ లేవని నివేదిక స్పష్టం చేసింది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆర్బీఐ అదనపు నిధులను తీసుకునేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు వివాదాస్పదం కావడంతో మాజీ ఆర్బీఐ గవర్నర్ జలాన్ అధ్యక్షతన ఆరుగురు సభ్యులతో కూడిన ఉన్నత స్ధాయి కమిటీ ఏర్పాటైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆర్బీఐ గవర్నర్‌గా ఉన్న ఉర్జిత్ పటేల్ ప్రభుత్వ చర్యల పట్ల వ్యతిరేకత వ్యక్తం చేయడంతోబాటు మాజీ ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యం వంటివారు దేశ ఆర్థికాభివృద్ధికి దోహదం చేసేలా ఆర్బీఐ మూలధనాన్ని పటిష్టవంతం చేయాలని సూచించడం జరిగింది. ఇది జరిగితే బ్యాంకు ఆర్థిక స్థితిలో సమతుల్యం వస్తుందని అధ్యయన నివేదిక వెల్లడించింది. రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించడం వంటివాటికి సైతం జలాన్ కమిటీ నివేదిక దోహదం చేయవచ్చని ఆ బ్రోకరేజ్ సంస్థ పేర్కొంది. వివాదం నడుస్తున్న క్రమంలో అప్పటి ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామా చేయడంతోబాటు పలు ఘటనలు చోటుచేసుకోవడంతో తర్వాత బాధ్యతలు చేపట్టిన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ప్రభుత్వంతో చర్చలు జరిపినమీదట ఓ ఉన్నత స్థాయి కమిటీని నియమించడం జరిగింది. గత మార్చి నెలాఖరుకే ఈ కమిటీ నివేదిక సమర్పించాల్సివుంది. ఐతే ఈ కమిటీ మరింత లోతుగా అధ్యయనం చేస్తున్న దృష్ట్యా త్వరలో నివేదిక సమర్పిస్తుందని ఈనెల 4న ఆర్బీఐ గవర్నర్ ప్రకటించడం జరిగింది.