బిజినెస్

ఇక దేశీయ మార్కెట్‌లోకి ‘జీఎమ్మార్’ బాస్మతి బియ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: ప్రఖ్యాత బాస్మతి బియ్యం ఎగుమతి సంస్ధ ‘జీఎమ్మార్ ఓవర్‌సీస్ లిమిటెడ్’ దేశీయ మార్కెట్లో తమ వ్యాపారాన్ని ఆరంభించాలని నిర్ణయించింది. రాబోయే రెండేళ్ల కాలంలో మనదేశంలో వ్యాపార విస్తరణకు రూ.50 కోట్ల పెట్టుబడులు కేటాయించాలని తీర్మానించింది. మనదేశంలో ప్యాకేజితో ఉన్న బాస్మతి బియ్యానికి రోజురోజుకూ డిమాండ్ పెరగుతున్న దృష్ట్యా ఇక్కడ మార్కెటింగ్‌కు అవకాశాలు గణనీయంగా వృద్ధి చెందాయని జీఎమ్మార్ ఓవర్‌సీస్ మేనేజింగ్ డైరెక్టర్ అతుల్ గార్గ్ ఆదివారం నాడిక్కడ తెలిపారు. 2017-18లో తమ కంపెనీ రూ. 950 కోట్ల టర్నోవర్‌ను సాధించిందని ఆయన చెప్పారు, ప్రస్తుతం హర్యానాలోని పానిపట్‌లోని రెండు ప్లాంట్లతో సహా ఇటీవలే గుజరాత్‌లో నెలకొల్పిన ఫ్లాంటుతో సహా మొత్తం మూడు ప్రాసెసింగ్ ప్లాంట్లు తమ కంపెనీకి ఉన్నాయన్నారు. తాము దేశంలోనే అతిపెద్ద బియ్యం ఎగుమతి దార్లలో మూడో స్థా నంలో ఉన్నామని, అంతర్జాతీయంగా ప్రాముఖ్యం పొందిన తమ బ్రాండ్‌ను మనదేశంలోని మార్కెట్‌లోనూ ప్రవేశ పెట్టబోతున్నామని గార్గ్ తెలిపారు. మూడు నుంచి నాలుగు రకాల బాస్మతి బియ్యం ప్యాకెట్లను కిలో రూ.50 నుంచి రూ.120 వరకు ధరలతో మార్కెట్లోకి ప్రవేశపెడతామన్నారు. వచ్చే ఐదేళ్లలో భారత్‌లో రూ.1000 కోట్ల వ్యా పార టర్నోవర్‌ను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వివరించా రు. ప్రస్తుతం మనదేశం మొత్తంలో బ్రాండెడ్ బాస్మతి బియ్యం వ్యా పారం రూ.14వేల కోట్ల మేర ఉందన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో తమ సంస్థ రూ.1100 కోట్ల విలువైన 1.4 లక్షల టన్నుల బాస్మతి బియ్యాన్ని విదేశాలను ఎగుమతి చేసినట్టు ఆయన వివరించారు.