బిజినెస్

14 వేల ఉద్యోగాల కోత!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాన్ జోస్ (కాలిఫోర్నియా), ఆగస్టు 17: అమెరికాకు చెందిన బహుళజాతి టెక్నాలజీ సంస్థ సిస్కో సిస్టమ్స్.. భారీగా ఉద్యోగులను తొలగిస్తోంది. ఏకంగా సుమారు 14,000 మందిని తీసేయడానికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిస్కో ఉద్యోగుల్లో దాదాపు 20 శాతానికి ఇది సమానం. ఈ ఏప్రిల్ 30 నాటికి సిస్కో ఉద్యోగుల సంఖ్య 70,000గా ఉంది. కాగా, కాలిఫోర్నియాలోని సాన్ జోస్ ప్రధాన కేంద్రంగా నడుస్తున్న ఈ సంస్థ.. ఇటీవలే హార్డ్‌వేర్ రంగం నుంచి సాఫ్ట్‌వేర్ రంగంలోకి అడుగిడింది. ఈ క్రమంలోనే సిస్కోకు నైపుణ్యం కలిగిన ఉద్యోగుల అవసరం మరింత పెరగగా, ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ అనుభవమున్న ఉద్యోగులు కావాల్సి వచ్చింది. దీంతో ఇప్పటికే ఉన్న ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటే మంచిదన్న నిర్ణయానికి వచ్చిన సిస్కో 14,000 మందికి ముందస్తు లేదా స్వచ్ఛంద పదవీ విరమణ (విఆర్‌ఎస్) ప్యాకేజీలను ఇస్తోంది. దీనివల్ల సంస్థాగత వ్యయం కూడా పెరగకుండా జాగ్రత్తపడినట్లు అవుతుందని సంస్థ భావిస్తోంది. ఈ ఉద్యోగుల తొలగింపుపై మరికొద్ది రోజుల్లో సిస్కో నుంచి అధికారిక ప్రకటన వెలువడే వీలున్నట్లు టెక్నాలజీ న్యూస్ సైట్ అయిన సిఆర్‌ఎన్ తెలియజేసింది. కొత్త విభాగంలోకి ప్రవేశించిన వేళ వీలైనంత తక్కువగా సంస్థపై ఆర్థిక భారం ఉండాలని సిస్కో అనుకుంటోందని, అందుకే హార్డ్‌వేర్ రంగంలోని కొందరు ఉద్యోగులను తీసేసి, సాఫ్ట్‌వేర్ రంగంలోకి కొత్త ఉద్యోగులను తెచ్చుకోనుందని సిస్కోతో సన్నిహిత సంబంధాలు కలిగిన సిఆర్‌ఎన్ వెల్లడించింది. ఇదిలావుంటే కారణాలు ఏమైనా అగ్రశ్రేణి బహుళజాతి సంస్థలు తమ ఉద్యోగులను పెద్ద ఎత్తున తొలగిస్తున్నాయి. విడతలవారీగా 18,000 మంది ఉద్యోగులను తీసేయనున్నట్లు 2014 జూలైలో మైక్రోసాఫ్ట్ ప్రకటించగా, మూడేళ్లలో 33,000 మందిని తొలగిస్తామని 2015 సెప్టెంబర్‌లో హెచ్‌పి సంస్థ చెప్పింది. అలాగే ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇంటెల్ సంస్థ కూడా 12,000 మందిని తొలగించనున్నట్లు స్పష్టం చేసింది. మొత్తానికి సిస్కో నుంచి ఇంటెల్‌దాకా ఇవన్నీ కూడా అమెరికాకు చెందిన టెక్నాలజీ సంస్థలే కావడం గమనార్హం.