బిజినెస్

వరుసగా మూడో రోజూ నష్టాలే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: అంతర్జాతీయ మార్కెట్లో అంతకంతకూ పెరుగుతున్న ముడిచమురు ధరల ప్రభావం భారతీయ స్టాక్ మార్కెట్లపై పడుతోంది. దీంతో వరుసగా మూడోరోజైన మంగళవారం సైతం సూచీలు ప్రతికూలతలను ఎదుర్కొన్నాయి. ప్రధానంగా ఫైనాన్షియల్, వాహన స్టాక్స్ పెద్దఎత్తున అమ్మకాల వత్తిడికి గురయ్యాయి. రోజంతా తీవ్ర అస్థిరతల నడుమ ఊగిసలాడిన బీఎస్‌ఈ సెనె్సక్స్ ఒక దశలో 300 పాయింట్లు లాభపడి 38,832.61 ఎగువకు చేరి చివరికి 80.30 పాయింట్ల నష్టంతో 38,518.26 దిగువకు చేరి స్థిరపడింది. అలాగే నిఫ్టీ సైతం 18.50 పాయింట్లు కోల్పోయి 0.16 శాతం నష్టాలతో 11,575.95 మార్కు వద్ద దిగువన స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ సైతం ఒక దశలో 81.50 పాయింట్ల ఎగువకు చేరడం గమనార్హం. కాగా సెనె్సక్స్ ప్యాక్‌లో మారుతీ అత్యధికంగా 3.60 శాతం నష్టాల పాలైన సంస్థగా నిలిచింది. భారీ నష్టాలను సంతరించుకున్న ఇతర సంస్థల్లో ఎస్ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, టాటాస్టీల్, హీరోమోటోకార్ప్, ఎన్‌టీపీసీ సైతం 2.33 శాతం మేర నష్టపోయాయి. మరోవైపు ఓఎన్‌జీసీ, సన్‌పార్మా, బజాజ్ హైనాన్స్, కోల్ ఇండియా, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్, హెచ్‌యూఎల్ దాదాపు 3.93 శాతం లాభపడ్డాయి. ఇరాన్‌కు చెందిన ముడిచమురును దిగుమతి చేసుకునే ఏ దేశానికీ సహకారం అందించరాదని అమెరికా దేశాక్షుడు ట్రంప్ సోమవారం నిర్ణయించడంతోబాటు టెహ్రాన్‌కు చెందిన అగ్రస్థాయి ఎగుమతులను నిలిపివేయడం భారత్‌కులోని ఇంధనం, విద్యుత్ రంగాల భద్రతకు ఇబ్బందికరంగా మారుతుందని వాణిజ్య రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 0.62 శాతం పెరిగి బ్యారెల్ 74.50 అమెరికన్ డాలర్లకు చేరింది. ఇలావుండగా దేశీయ సంస్థాగత ఇనె్వస్టర్లు రూ. 68.16 కోట్ల విలువైన వాటాలను విక్రయించగా, విదేశీ సంస్థాగత ఇనె్వస్టర్లు రూ. 73.50 కోట్ల విలువైన వాటాలను కొనుగోలు చేశారని స్టాక్ ఎక్చేంజ్ ప్రాథమిక గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఇక సుదీర్ఘ ఈస్టర్ వారంలో ఆసియా దేశాల్లో చైనా, దక్షిణ కొరియా, జపాన్ దేశాల స్టాక్ మార్కెట్ సూచీలు ఒడిదుడుకులకు గురికాగా, ఐరోపా దేశాల సూచీలు మిశ్రమ ఫలితాలను నమోదు చేశాయి.