బిజినెస్

అవసరానికి సరిపడా ముడి చమురు సరఫరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: ముడిచమురు ధరలు బుధవారం స్వల్పంగా తగ్గాయి. మనదేశ విపణివీధిలో ఈ ధరలు 0.40 శాతం తగ్గి బ్యారెల్ రూ.4,622 పలికింది. వారం మొత్తం జరిగిన దిగుమతిని అంచనా వేస్తే మనదేశ అవసరాలకు సరిపడా ముడిచమురు దిగుమతి జరిగింది. బహుళ వినిమయ వస్తువుల ఎక్చేంచ్ గణాంకాల ప్రకారం వచ్చే మే నెలలో సరఫరా జరిగే ముడిచమురు ధర 0.41 శాతం లేదా రూ. 19 తగ్గి బ్యారెల్ రూ. 4,622 వద్ద ట్రేడయ్యే అవకాశాలున్నాయి. అలాగే వ్యాపార టర్నోవర్ 28,115 లాట్స్ వరకు ఉంటుంది. ఒకవైపు ఇరాన్ నుంచి ముడిచమురు దిగుమతి చేసుకునే దేశాలపై అమెరికా ఆంక్షలు విధించినప్పటికీ అంతర్జాతీయ మార్కెట్‌లో ఇప్పటికే అవసరమైన మేరకు ముడిచమురు సరఫరా జరగడం వల్లే ముడిచమురు ధరల్లో తగ్గుదల నెలకొందని వ్యాపార వర్గాలు తెలిపాయి. అలాగే జూన్‌లో సరఫరా కోసం సిద్ధంగా ఉన్న ముడిచమురుపై కూడా బేరల్‌పై 0.32 శాతం అంటే రూ.15 తగ్గే అవకాశాలున్నాయి. ఆ నెలలో 463 లాట్స్‌కు బేరల్ ధర ఉ. 4,637 వంతున ఉంటుంది. ఇలావుండగా పడమటి టెక్సాస్‌లో అంతర్గత మధ్యంతర ముడిచమురు సరఫరా ధరలు సైతం 0.62 శాతం తగ్గి బ్యారెల్ 65.89 డాలర్ల వంతున ట్రేడైంది. అలాగే న్యూయార్క్ మర్కంటైల్ ఎక్చేంజ్‌లో సైతం ముడిచమురు ధరలు సుమారు 0.48 శాతం తగ్గుదల నమోదై బ్యారెల్ 74.15 డాలర్ల వంతున ట్రేడైంది.