బిజినెస్

సెనె్సక్స్ పరుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో బుధవారం ట్రేడింగ్ సానుకూల ధోరణుల్లో కొనసాగింది. సెనె్సక్స్ 489.80 పాయింట్లు మెరుగుపడి, 39,095.35 పాయింట్లకు చేరుకోగా, జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో నిఫ్టీ 150.20 పాయింట్లు లాభపడి, 11,726.15 పాయింట్లకు పెరిగింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (రిల్), హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్ గత ఆర్థిక సంవత్స రం చివరి త్రైమాసిక ఫలితాలు, సాధించిన అభివృద్ధిని చూసి మదుపరులు షేర్ల కొనుగోళ్లపై ఆసక్తి ప్రదర్శించారు. దీంతో ఉదయం లావాదేవీలు మొ దలైన మరుక్షణం నుంచే బుల్ రన్ కొనసాగింది. సెనె్సక్స్‌లో హెచ్‌సీఎల్ టెక్, ఓఎన్‌జీసీ కంపెనీల షేర్లు అన్నిటికంటే ఎక్కువగా లాభపడ్డాయి. ఈ షే ర్ల విలువ సగటున 3.40 శాతం పెరిగింది. ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఎస్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రిలయన్స్ ఇం డస్ట్రీస్ లిమిటెడ్, బజాజ్ ఫైనాన్స్, ఎస్‌బీఐ, టీసీఎస్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐటీసీ కంపెనీల షేర్లు సగటున 2.75 శాతం చొప్పున లాభాల్లో ట్రేడయ్యా యి. అయితే, అంతర్జాతీయ సూచీలు సానుకూలంగానే ఉన్నప్పటికీ, టాటా మోటార్స్, హీరో మోటోకార్ప్, కోల్ ఇండియా, పవర్‌గ్రిడ్, మారుతీ, యా క్సిస్ బ్యాంక్, ఎన్‌టీపీసీ కంపెనీలకు చెందిన షేర్లు సగటున 3.33 శాతం చొప్పున పతనమయ్యాయి. అమెరికా ఈక్విటీ మార్కెట్‌లో కనిపించిన సానుకూల ధోరణులకు, ముడి చమురు ధరలు కొంత మేరకు పతనం కావడం కూడా భారత మార్కెట్‌ను లాభాల్లో నడిపింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ ముడి చమురు ధర 0.08 శాతం తగ్గి, 74.45 డాలర్లకు చేరింది. వాల్‌స్ట్రీట్‌లో, ఎస్ అండ్ పీ 500, నాస్డాగ్ సూచీలు కూడా రికార్డు పాయింట్లతో ముగిశాయి. ఆసియాలో షాంఘై, టోక్యో, సియోల్ మార్కెట్లు అనూహ్యంగా నష్టాలను చవిచూశాయి. యూరోపియన్ మార్కెట్లలో మిశ్రమ ఫలితాలు కనిపించాయి. ఇలావుంటే, మంగళవారం నాటి ట్రేడింగ్‌లో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు రూ.237.47 కోట్ల విలువైన షేర్లను కొన్నారు. దేశీయ మదుపరులు రూ.198.35 కోట్ల విలువైన వాటాలను కొనుగోలు చేశారు. రూపాయి మారకపు విలువ 21 పైసలు పతనమైంది. దీనితో డాలర్ విలువ రూ.69.83 కు చేరింది.