బిజినెస్

ఓటీటీ వాణిజ్యంలోకి డిష్‌టీవీ.. ‘వాచో’ ఆవిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: డిష్‌టీవీ గురువారం ‘ఆన్‌లైన్ వీడియో ఆన్ డిమాండ్’ సెగ్మెంట్‌లోకి అడుగిడింది. ఓవర్ ది ఆప్ (ఓటీటీ) వేదిక ‘వాచో’ను ఆవిష్కరించింది. తద్వారా వచ్చే సంవత్సర కాలంలో సుమారు 10 మిలియన్ వినియోదారులు సమకూరుతారని ఆ సంస్థ అంచనా వేస్తోందని డిష్‌టీవీ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, గ్రూప్ సీఈవో అనిల్ దుయా తెలిపారు. ఎస్సెల్ గ్రూప్ నేతృత్వంలోని డిష్‌టీవీకి చెందిన ఈ విభాగం దేశంలోని యువ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఈ సరికొత్త ప్రక్రియకు తెరలేపింది. ఆ వ్యూహం మేరకు షార్ట్ ఫార్మేట్ కంటెట్లను ఆ సంస్థ ఆఫర్ చేయనుంది. హిందీ, కర్నాటక, తెలుగు వంటి భాషల వారికి కూడా ఆర్థికంగా అందుబాటులో ఈ యూజర్ జనరేటెడ్ ప్లాట్‌ఫాం ఉంటుందని ఆయన తెలిపారు. బోజ్‌పురి, గుజరాతి వంటి అన్ని ప్రాంతీయ భాషల్లో ఈ కంటెంట్లు ఉంటాయని, ఓవర్ ద టాప్ సర్వీస్‌ను ప్రస్తుతం ఉన్న దాదాపు 23 మిలియన్ డీటీహెచ్ వినియోగదారులకు ఉచితంగా అందజేయడం జరగుతుందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న తమకంపెనీ వ్యవస్థను బలోపేతం చేసుకోవడానికి వీలుకలుగుతుందని ఆయన చెప్పారు. మొత్తం 1000 గంటల లైబ్రరీ కంటెంట్‌ను ‘వాచో’ ఆఫర్ చేస్తుందని, ఇందులో సినిమాలు, షార్ట్ ఫిల్మ్ లు సైతం ఉంటాయని ఆయన వివరించారు.