బిజినెస్

నిధుల సమీకరణకు వొడాఫోన్-ఐడియా యత్నాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 25: రైట్స్ ఇస్యూ ద్వారా దాదాపు రూ. 25వేల కోట్ల నిధుల సమీకరణ యత్నాల్లో ఉన్న వొడాఫోన్, ఐడియా సంయుక్త సంస్థ రానున్న 2021వ సంవత్సరానికి సైతం మరోమారు నిధుల సమీకరించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఈటెలికాం సంస్థకు ఈ ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ షేర్ నష్టపోకతప్పదని విదేశీ బ్రోకరేజ్ సంస్థ ‘జెఫరీస్’ అధ్యయన నివేదిక గురువారం నాడిక్కడ వెల్లడించింది. ఇప్పటికే మార్కెట్లో ఎదురైన తీవ్ర పోటీతో నలిగిపోయిన టెలికాం సంస్థలు పూర్తిగా కోలుకోవడానికి మరో ఏడాది కాలం పట్టే అవకాశం ఉందని, ప్రధానంగా ఇందుకు కారణమైన రిలయన్స్ జియో వినియోగదారుల అదనపుఅవసరాలను సైతం అందుకుంటూ పురోగమిస్తున్నందున ఈ విషయంలో ఇతర సంస్థలు వెనుకబడుతున్నాయని ఆ అధ్యయన నివేదిక వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థానికల్లా టెలికాం ఆపరేటర్లు సుమారు లక్ష కోట్లు ప్రధాన ఈక్విటీల్లోకి సమీకరించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయని ఆ నివేదిక పేర్కొంది. అతిపెద్ద టెలికాం సంస్థగా ఆవిర్భవించిన వడాఫోన్ ఐడియా వచ్చే ఆర్థిక సంవత్సరంలో సైతం నిధులు సమీకరిస్తేనే కేపెక్స్, స్పెక్ట్రం బకాయిల చెల్లింపులకు వీలవుతుందని, లేదంటే ఈ సంయుక్త సంస్థ మార్కెట్ షేర్‌ను వచ్చే 18 నెలల్లో సుమారు 25 శాతం వరకు నష్టపోయే అవకాశం ఉందని ఆ అధ్యయనం వెల్లడించింది. రెండవ అతిపెద్ద టెలికాం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్ మార్కెట్ షేర్ మాత్రం ప్రస్తుతం (2018నాటికి) ఉన్న 35 శాతం అలాగే స్థిరంగా కొనసాగుతుందని ఆ నివేదిక పేర్కొంది. ధరలు పెంచితేగానీ టెలికాం సంస్థల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడే అవకాశాలు లేవని అందువల్ల ఈ ఏడాది టెలికాం సంస్ధలు ఈ విషయంపై దృష్టి కేంద్రీకరించక తప్పదని పేర్కొంది. అలాగే 2021 ఆర్థిక సంవత్సరానికి రిలయన్స్ జియో మార్కెట్ షేర్ సుమారు 40 శాతానికి చేరుతుందని ఆ అధ్యయనం వెల్లడించింది. కాగా వొడాఫోన్ ఐడియా ప్రస్తుతం రైట్స్ ఇస్యూ ద్వారా చేపట్టిన రూ. 25వేల కోట్ల నిధుల సమీకరణతోబాటే భారతీ ఎయిర్‌టెల్ కూడా ఇతే తరహాలో ఇదే మార్గంలో నిధుల సమీకరణకు దిగడం గమనార్హం. ఇలా ఇరు ప్రధాన టెలికాం సంస్థలు సుమారు రూ. 50వేల కోట్ల సమీకరించనుండగా, ఇంతే మొత్తం ఈక్విటీ ఫండింగ్‌కు జియో ఫైబర్, టవర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇనె్వస్ట్‌మెంట్ ట్రస్టు (ఐఎన్‌వీఐటీ) సైతం పావులు కదుపుతోంది. ఈ సంస్థలకు సుమారు 1.1ట్రిలియన్ రూపాయల నిధుల ఆవశ్యకత ఉందని నివేదిక వెల్లడించింది. రిలయన్స్ జియో తనకు చెందిన ఫైబర్, టవర్ అసెట్స్ విభాగాన్ని విభజించి మరో కంపెనీ (ఐఎన్‌వీఐటీ)గా రూపొందించింది. దానికి నిర్వహణ కోసం రూ.1,073 బిలియన్లను బదలాయించింది. కాబట్టి దీని ఈక్విటీ వృద్ధి కోసం నిధుల సమీకరణ జరిగనుందని అధ్యయనం తెలిపింది. కాగా గడచిన నాలుగో త్రైమాసికానికి సంబంధించిన వివరాలను ఇంకా వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్ విడుదల చేయాల్సివుంది. అందులో ఆదాయాలు స్థిరత్వం నుంచి స్వల్ప తక్కువ స్థాయికి నమోదయ్యే అవకాశాలున్నాయని నివేదిక పేర్కొంది.
వొడాఫోన్ ఐడియా రైట్స్ ఇస్యూకు స్పందన
రూ. 25వేల కోట్ల సమీకరణ కోసం వొడాఫోన్ ఐడియా విడుదల చేసిన రైట్స్ ఇస్యూ 1.07 మార్లు సబ్‌స్క్రైబ్ అయిందని మార్కెట్ గణాంకాలు చెబుతున్నాయి. ఈప్రక్రియలో వాణిజ్య బ్యాంకులు జోక్యం ఉన్నందువల్ల సానుకూల స్పందన వచ్చిందని తెలిసింది.
ఈ రైట్స్ ఇస్యూ కాల వ్యవధి ఏప్రి ల్ 10 నుంచి 24 వరకు కాగా దేశంలో నే అతిపెద్ద టెలికాం సంస్థగా ఆవిర్భవించిన ఈ సంస్థ ఈ ఇస్యూ ద్వారా రెండువేల కోట్ల కొత్త కొత్త వాటాల సమీకరణకు వాటా రూ.12.50 వంతున ఆఫర్ చేసింది. కాగా ఎన్‌ఎస్ ఈ గణాంకాల మేరకు 1,109 కోట్ల వాటాల కోసం బిడ్లు వచ్చాయని తెలిసింది.