బిజినెస్

అమ్మకాల ఒత్తిడిలో ఐటి, చమురు షేర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 17: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం కూడా నష్టాలపాలయ్యాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 59.24 పాయింట్లు క్షీణించి 28,005.37 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 18.50 పాయింట్లు దిగజారి 8,624.05 వద్ద నిలిచింది.
అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల పతనానికితోడు వచ్చే నెల నిర్వహించే ద్రవ్యసమీక్షలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్లను పెంచే వీలుందన్న సంకేతాల మధ్య ప్రధానంగా ఐటి, చమురు, గ్యాస్, ఔషధ రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. వీటితోపాటు ఎఫ్‌ఎమ్‌సిజి, విద్యుత్ రంగ షేర్ల విలువ కూడా పడిపోయింది. ఈ క్రమంలోనే సూచీలకు మరోసారి నష్టాలు తప్పలేదు. మంగళవారం కూడా సూచీలు నష్టాలకే పరిమితమైనది తెలిసిందే.
ఇకపోతే అటు అంతర్జాతీయంగా ఆసియా మార్కెట్లలో చైనా, హాంకాంగ్, సింగపూర్, దక్షిణ కొరియా సూచీలు కూడా 0.02 శాతం నుంచి 0.54 శాతం మేర కోల్పోయాయి. ఇటు ఐరోపా మార్కెట్లలోనూ ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ సూచీలు 0.68 శాతం వరకు నష్టపోయాయి.