బిజినెస్

లాభాల్లో స్టాక్ మార్కెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 26: బాంబే స్టాక్ మార్కెట్ (బీఎస్‌ఈ)లో లావాదేవీలకు చివరి రోజైన శుక్రవారం లాభాల్లో ముగిసింది. అంతర్జాతీయ సూచీలు సానుకూల ధోరణులను ప్రదర్శించడంతోపాటు, ప్రపంచ మార్కెట్‌లో ముడి చమురు ధర స్వల్పంగా తగ్గడం కూడా భారత స్టాక్ మార్కెట్‌కు లాభాలను ఆర్జించి పెట్టింది. ఒకానొద దశలో సెనె్సక్స్ 39,103.16 పాయింట్లకు చేరుకున్నప్పటికీ, ఆతర్వాత కొంత పతనమైంది. మొత్తం మీద 336.47 పాయింట్లు (0.87 శాతం) లాభాలతో 36,067.33 పాయింట్ల వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ మార్కెట్ ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ సూచీ కూడా 112.85 పాయింట్లు (0.97 శాతం) పెరిగి, 11,754.65 పాయింట్లకు చేరింది. ఒకదశలో నిఫ్టీ 11,762.90 పాయింట్లకు చేరినప్పటికీ, అదే పెరుగుదలను నిలబెట్టుకోలేకపోయింది. మొత్తం మీద బీఎస్‌ఈలో బ్యాంకింగ్, చమురు-సహజవాయువు, ఐటీ కంపెనీల షేర్లు లాభాల్లో నడిచాయి. గురువారం నాటి మార్కెట్‌లో భారీ నష్టాలను ఎదుర్కొ న్న స్టాక్ మార్కెట్ శుక్రవారం అందుకు భిన్నంగా లాభాలను నమోదు చేయడం విశేషం. భారీగా లా భపడిన కంపెనీల్లో టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్ ముందు వరుసలో నిలిచాయి. ఈ రెండు కంపెనీలు గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన చివరి త్రైమాసిక ఫలితాలను వెల్లడించడంతో, మదుపరులు సానుకూలంగా స్పందంచారు. ఐసీఐసీఐ బ్యాంక్, టీసీఎస్, ఎస్‌బీఐ, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (రిల్), ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కోటక్ బ్యాంక్, హెచ్‌యూఎల్, ఎన్‌టీపీసీ, ఇండస్‌ఇండ్ బ్యాంక్, సన్ ఫార్మా, హెచ్‌సీఎల్ టెక్, బజాజ్ ఫైనాన్స్, ఎల్ అండ్ టీ, ఐటీసీ తదితర కంపెనీల స్టాక్స్ కూడా లాభాల్లో ట్రేడయ్యాయి. వీటి వాటా ధర సగటున 3.05 శాతం పెరిగింది. కాగా, టాటా మోటర్స్, బజాజ్ ఆటో, మారుతీ సుజికీ, భారతీ ఎయిర్‌టెల్, కోల్ ఇండియా, మహీంద్ర అండ్ మహీంద్ర, వేదాంత కంపెనీల షేర్లు సగటున 2.84 శాతం నష్టాలను చవిచూశాయి. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో లాభాలను ఆర్జించినప్పటికీ, హీరో మోటోకార్ప్, ఎస్ బ్యాంక్ షేర్లకు డిమాండ్ లేకపోవడం గమనార్హం. ఈ కంపెనీల వాటాలు 0.51 శాతం నష్టాల్లో ట్రేడయ్యాయి. ముడి చమురు ధరలో తగ్గుదల, విదేశీ నిధుల ఇన్‌ఫ్లో వంటి అంశాలు స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపాయి. ముడి చమురు బ్యారెల్‌కు 1.28 శాతం తగ్గడంతో, ధర 73.41 డాలర్లకు పడిపోయింది.