బిజినెస్

బాండ్ల ద్వారా రూ. 3 వేల కోట్లు సమీకరించనున్న ఎన్‌టీపీసీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: బాండ్ల ద్వారా రూ. 3,055.50 కోట్ల మొత్తాన్ని సమీకరించాలని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌టీపీసీ) నిర్ణయించింది. వచ్చే మే3వ తేదీన శుక్రవారం ఇందుకు సంబంధించిన బాండ్లను విడుదల చేయనున్నట్టు ఆ సంస్థ పేర్కొంది. ప్రైవేటు ప్లేస్‌మెంట్ విధానం ద్వారా ఈ బాండ్లను జారీ చేయడం జరుగుతుందని పేర్కొంది. సురక్షితమైన మార్పుచేయలేని బాండ్లను ఇందుకు సంబంధించి రూపొందించడం జరిగిందని, ఇవి డిబెంచర్ల తరహాలో ఒక్కో కూపన్ 7.93 శాతం ప్రతిఏటా వరుసగా మూడేళ్లపాటు డోర్ టు డోర్ మెచూరిటీని కల్పిస్తుందని ఆ కంపెనీ మంగళవారం నాడిక్కడ విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. ఇలా సమీకరించే మొత్తాన్ని ప్రధానంగా మూలధన బలోపేతానికి, వర్కింగ్ కేపిటల్ అవసరాలకు, ప్రస్తుతం ఉన్న రుణాల పునర్వ్యవస్థీకరణకు, ఇతర సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించడం జరుగుతుందన్నారు. జాతీయ స్టాక్ ఎక్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)తోబాటు బీఎస్‌ఈ జాబితాలో సైతం ఈ బాండ్లు చోటుచేసుకునేలా ప్రతిపాదించామని ఎన్‌టీపీసీ పేర్కొంది. కంపెనీ చట్టాలు, మార్గదర్శకాల మేరకు ఇందుకు సంబంధించిన బాండ్లకు సెక్యూరిటీని కల్పించడం జరిగిందని, అ వసరాలు, కాలవ్యవధిని ఇందుకోసం పరిగణనలో కి తీసుకోవడం జరిగిందని కంపెనీ వివరించింది.