బిజినెస్

కార్పొరేట్ బాండ్స్‌కు తగ్గిన డిమాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 1: కార్పొరేట్ బాండ్స్‌కు డిమాం డ్ తగ్గుతున్నది. గత ఏడాదితో పోలిస్తే, ఈ ఏడాది టర్నోవర్ పతనం స్పష్టంగా కనిపిస్తున్నది. నిధుల సేకరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లేదా కార్పొరేట్ సంస్థలు జారీ చేసే ఈ బాండ్స్‌పై ముఖ విలువను నిర్ధిష్ట సమయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) చెల్లిస్తుంది. అప్పటి వరకూ, డివిడెండ్లను అందిస్తారు. సాధారణంగా ఏడాది రెండు పర్యాయాలు బాండ్స్‌పై వడ్డీని డివిడెండ్ల రూపంలో చెల్లిస్తుంటారు. అయితే, ఇతరత్రా పెట్టుబడులతో పోలిస్తే, కార్పొరేట్ బాండ్స్ ద్వారా వచ్చే లాభం లేదా వడ్డీ రేటు చాలా తక్కువ. అందుకే, పెట్టుబడిదారులు కార్పొరేట్ బాండ్స్‌వైపు మొగ్గు చూపడం లేదు. అసలుకు భరోసా ఉంటుందనే ఏకైక భావంతో పెట్టుబడులకు సిద్ధమయ్యేవారిని తప్ప, స్టాక్ మార్కెట్ లేదా బులియన్ మార్కెట్‌లో క్రయవిక్రయాలు జరిపే మదుపరులను మాత్రం కార్పొరేట్ బాండ్స్ ఆకర్షించలేకపోతున్నాయి. అందుకే, గత ఏడాది మార్చి మాసంలో ఈ బాండ్స్ టర్నోవర్ 19,428 కోట్ల రూపాయలుకాగా, ఈ ఏడాది ఫిబ్రవరి చివరి నాటికి 1,22,624 కోట్ల రూపాయలకు పతనమైంది. గత ఏడాది ఏప్రిల్‌లో 1,63,249 కోట్ల రూపాయలు, మేలో1,45,786 కోట్ల రూపాయలు చొప్పున లావాదేవీలు జరిగాయి. జూన్ మాసంతో కొంత మెరుగుపడి, 1,56,416 కోట్లకు చేరుకున్నప్పటికీ, జూలైలో మళ్లీ కొంత పతనమై, 1,45,854 కోట్ల రూపాయలకు చేరింది. ఆగస్టు మాసంలో మరింతగా దిగజారి 1,36,003 కోట్లకు పడిపోయింది. సెప్టెంబర్ (1,23,019 కోట్ల రూపాయలు), అక్టోబర్ (1,23,701 కోట్ల రూపాయలు) నెలల్లో కార్పొరేట్ బాండ్స్ టర్నోవర్ మరింతగా పతనమైంది. నవంబర్‌లో సానుకూల పరిస్థితులు నెలకొనడంతో, ఊపిరి పీల్చుకుంది. టర్నోవర్ 1,23,701 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఏడాదిలోనే అత్యధిక టర్నోవర్ డిసెంబర్ మాసంలో జరిగింది. 1,80,169 కోట్ల రూపాయల టర్నోవర్ సహజంగానే కార్పొరేట్ బాండ్స్ పెట్టుబడిదారులకు కొత్త ఆశలు రేపింది. కానీ, ఈ ఏడాది ఆరంభంలోనే, జనవరి మాసంలో టర్నోవర్ 1,64,348 కోట్లకు పడిపోయింది. ఫిబ్రవరిలో మరింతగా పతనమై, 1,22,624 కోట్ల రూపాయలకు చేరింది. ఇందులో బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ) వాటా 40,133 కోట్ల రూపాయలుకాగా, జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) వాటా 83,491 కోట్ల రూపాయలు. ఫిక్స్‌డ్ ఇన్‌కం మనీ మార్కెట్ అండ్ డిరైవటీవ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఐఎంఎండీఏ)లో అసలు కార్పొరేట్ బాండ్స్ లావాదేవీలే జరగలేదు. కాగా, అనధికార గణాంకాల ప్రకారం కార్పొరేట్ బాండ్స్ టర్నోవర్ పతనం మార్చి, ఏప్రిల్ మాసాల్లోనూ కొనసాగింది.