బిజినెస్

కొత్తకోణంలో వాణిజ్య విస్తరణకు మాక్స్ ఇండియా యత్నాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 1: ఆరోగ్య రక్షణ, ఆరోగ్య బీమా వ్యాపారంలో పేరెన్నికగన్న మాక్స్ ఇండియా తన వాణిజ్యాన్ని కొత్తకోణంలో ఆవిష్కరించాలని భావిస్తోంది. ప్రత్యేకించి లైఫ్ ఇన్సూరెన్స్‌తోబాటు స్థిరాస్తి వ్యాపారం, సీనియర్ కేర్, హోటళ్ల రంగం వంటి వాటిలోకి వాణిజ్యాన్ని విస్తరించాలని భావిస్తున్నట్టు సోమవారం నాడిక్కడ విడుదల చేసిన ఓ ప్రకటనలో ఆ కంపెనీ పేర్కొంది. అలాగే కంపెనీకి చెందిన వాటాదార్లకు హెల్త్‌కేర్, ఇన్సూరెన్స్ వాణిజ్యంలో కొంత భాగస్వామ్యాన్ని కల్పించనున్నట్టు తెలిపింది. హెల్త్ ఇన్సూరెన్స్‌లో మాక్స్‌బూపా పేరుతో ప్రైవేటు ఈక్విటీ సంస్థ ట్రూ నార్త్‌తో కలిసి నిర్వహిస్తున్న సంయుక్త సంస్థలో తమ 51 శాతం వాటాలను విక్రయించేందుకు మాక్స్ ఇండియా ప్రస్తుతం ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా రెండు లిస్టెడ్ కంపెనీలతోనూ ఉన్న బంధాలను తెంచుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తోంది. ఇందులో ఒకటి మ్యాక్స్‌హెల్త్ కేర్‌ను కేకేఆర్ ఆస్పత్రుల నిర్వహణలోని రేడియంట్ లైఫ్‌కేర్‌తో విలీనం చేయడం ద్వారా దేశంలోనే అతిపెద్ద మూడో కార్పొరేట్ ఆస్పత్రిగా అవతరింపజేయడం. తద్వారా 16 ఆస్పత్రులు, 3,200 పడకలతో స్టాక్ మార్కెట్‌లో చోటు దక్కించుకోవాలని భావించింది. అలాగే మరొకటి ‘అద్వైత’ పేరుతో ఏర్పాటయ్యే కంపెనీ ద్వారాగ్రూప్ వాణిజ్యంతోబాటు ‘అంతర సీనియర్ లివింగ్’ నిర్వహణను సాగిస్తుంది. దీనికి మాక్స్‌బుపా నుంచి సేకరించిన రూ. 500 కోట్ల కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాలని భావించింది. కాగా కంపెనీకి చెందిన ప్రమోటర్, చైర్మన్ అనల్జిత్ సింగ్ సరికొత్త ‘అద్వైత’ను తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేపట్టారు. ఇందులో భాగంగా 1-2 వ్యాపార విభాగాల్లో వెంచర్లు చేపట్టాలని భావిస్తున్నారని కంపెనీ తెలిపింది. అందులో భాగంగా గ్రూప్ నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో లైఫ్ ఇన్సూరెన్స్‌తోబాటు స్థిరాస్తి వ్యాపారం, సీనియర్ కేర్, లైఫ్‌స్టైల్ కార్యక్రమాలు ఉంటాయని కంపెనీ వివరించింది. అద్వైత తన నిధి నిల్వలను వినియోగించుకుని ఒక ఎగ్జిట్ ఆపర్చునిటీ ఆఫర్‌ను సైతం మూలధన తగ్గింపు చర్యల ద్వారా ఇవ్వాలని భావిస్తోంది. వాటాదార్లు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని కంపెనీ తెలిపింది.