బిజినెస్

తగ్గిన తేయాకు ఎగుమతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 1: తేయాకు ఎగుమతులు దగ్గడం అటు ఉత్పత్తిదారులను, ఇటు వ్యాపారులను ఆందోళనకు గురి చేస్తున్నది. గత ఏడాది ఫిబ్రవరి మాసంలో 2.87 కోట్ల కిలోల తేయాకును భారత్ వివిధ దేశాలకు ఎగుమతి చేసింది. మార్చి మాసంలో 2.50 కోట్ల కిలోలను ఎగుమతి చేసింది. అయితే, ఎగుమతులు తగ్గి, ఏప్రిల్‌లో 1.44 కోట్ల కిలోలు, మేలో 1.43 కోట్ల కిలోలుగా నమోదైంది. జూన్ నుంచి ఎగుమతులు మళ్లీ ఊపందుకున్నాయి. జూన్‌లో 1.80 కోట్ల కిలోలు, జూలైలో 2.12 కోట్ల కిలోల తేయాకును భారత్ ఎగుమతి చేసింది. ఆగస్టులో 2.09 కోట్ల కిలోలు, సెప్టెంబర్‌లో 1.96 కోట్ల కిలోల తేయాకును వివిధ దేశాలకు పంపింది. అక్టోబర్‌లో, రికార్డు స్థాయిలో 2.66 కోట్ల కిలోల తేయాకు ఎగుమతి సాధ్యమైంది. నవంబర్‌లో 2.54, డిసెంబర్‌లో 2.33 కోట్ల కిలోల టీని ఎగుమతి చేశారు. ఈ ఏడాది జనవరిలో ఎగుమతులు 2.28 కోట్ల కిలోలుకాగా, ఫిబ్రవరిలో భారీగా దెబ్బతిని, 1.88 కోట్ల కిలోలతో సరిపుచ్చుకుంది. మొత్తం మీద 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి మధ్యకాలంలో 23.6 కోట్ల కిలోల తేయాకు భారత్ ఎగుమతి చేసింది. కాగా, 2018-19 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి మధ్యకాలంలో ఈ మొత్తం 20.3 కోట్ల కిలోలకు పతనమైంది.
తేయాకు ఉత్పత్తిలో మొదటి పది స్థానాలను దక్కించుకున్న దేశాల్లో భారత్‌కు మూడో స్థానం దక్కుతుంది. చైనా, కెన్యా మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. ప్రపంచ తేయాకు మార్కెట్‌లో చైనాది 25.7 శాతంకాగా, కెన్యాది 6.2 శాతం. భారత్ వాటా 11 శాతం. ఈ ‘టాప్-10’ జాబితాలో శ్రీలంక (10.4 శాతం), జర్మనీ (3.6 శాతం), పోలాండ్ (2.9 శాతం), జపాన్ (2 శాతం), యునైటెడ్ కింగ్‌డమ్ (2 శాతం), అమెరికా (1.8 శాతం), వియత్నాం (1.7 శాతం) ఉన్నాయి. మన దేశంలో అత్యధికంగా తేయాకు అస్సాంలో పండుతోంది. అస్సాం టీకి ప్రపంచ వ్యాప్తంగా విశేష ఆదరణ ఉంది. డార్జిలింగ్ (పశ్చిమ బెంగాల్), నీల్‌గిరి (తమిళనాడు), కాంగ్రా (హిమాచల్‌ప్రదేశ్), మున్నార్ (కేరళ), కూర్గ్ (కర్నాటక), త్రిపుర తేయాకుకు కూడా డిమాండ్ ఎక్కువ.