బిజినెస్

గోధుమ నిల్వలు తగ్గుముఖం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: గోధుమ నిల్వలు క్రమం తప్పకుండా తగ్గుముఖం పడుతున్నాయి. గత ఏడాది మార్చి నెలతో పోలిస్తే పరిస్థితి మెరుగ్గానే కనిపిస్తున్నప్పటికీ, మే మాసం నాటి అత్యధిక నిల్వలు తరిగిపోతున్నాయి. గత ఏడాది మార్చిలో 13.2 మిలియన్ టన్నులుగా ఉన్న గోధుమ నిల్వలు ఏప్రిల్ మాసానికి 35.3 మిలియన్ టన్నులకు పెరిగాయి. మే మాసంలో గరిష్టంగా 43.8 మిలియన్ టన్నులకు చేరాయి. కానీ, ఆతర్వాత మొదలైన సూచీ పతనం ఈ ఏడాది మార్చి వరకూ కొనసాగుతునే ఉంది. గత ఏడాది జూన్‌లో 41.8 మిలియన్ టన్నులు, జూలైలో 40.9 మిలియన్ టన్నుల గోధుమ నిల్వలు ఉన్నట్టు గణాంకాలు పేర్కొంటున్నాయి. ఆగస్టులో 38.5 మిలియన్ టన్నులు, సెప్టెంబర్‌లో 35.6 మిలియన్ టన్నులు, అక్టోబర్‌లో 33.1 మిలియన్ టన్నులు, నవంబర్‌లో 30.6 మిలియన్ టన్నులు, డిసెంబర్‌లో 27.1 మిలియన్ టన్నులు చొప్పున గోధుమ నిల్వలు ఉన్నాయి. ఈ ఏడాదిలోనూ పరిస్థితిలో ఏమాత్రం మార్పు చోటు చేసుకోలేదు. జనవరిలో 23.9 మిలియన్ టన్నులుగా ఉన్న నిల్వలు ఫిబ్రవరి మాసంలో 20.1 మిలియన్ టన్నులకు చేరాయి. మార్చిలో మరింత పతనమై, 17 మిలియన్ టన్నులకు పడిపోయాయి. ఈ ఏడాది గోధుమ పంట రికార్డు స్థాయిలో ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. ఈ కారణంగానే గోధుమ దిగుమతులపై కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని 10 శాతం పెంచింది. దీనితో సుంకం 30 నుంచి 40 శాతానికి చేరింది. దిగుమతులు తగ్గినప్పుడు, దేశీయంగా ఉత్పత్తయిన గోధుమకే డిమాండ్ పెరుగుతుందనేది వాస్తవం. ఒకవేళ ఆశించిన స్థాయిలో అమ్మకాలు జరగకపోతే, రైతులను ఆదుకోవడానికి, కేంద్రమే కనీస గిట్టుబాటు ధర చెల్లించి గోధుమ ఉత్పత్తులను నిల్వ చేస్తుంది. ఈ నేపథ్యంలో, నిల్వలు భవిష్యత్తులో పెరుగుతాయన్న వాదన బలంగా వినిపిస్తున్నది.