బిజినెస్

జీఎస్‌టీ రికార్డు వసూళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు అంచనాలను మించిపోతున్నాయి. గత మాసంలో రికార్డు స్థాయిలో 1.06 లక్షల కోట్ల రూపాయలు జీఎస్‌టీ రూపంలో ఖజానాకు చేరాయి. ఈ రికార్డును ఏప్రిల్ అధికమించింది. 1.13 లక్షల కోట్ల రూపాయల వసూళ్లతో కొత్త చరిత్రను సృష్టించింది. 2017 జూలై మాసంలో అత్యధికంగా 75.05 లక్షల కోట్ల రూపాయలు వసూలుకాగా, ఆ రికార్డు మార్చిలో వసూళ్లు బద్దలు చేసింది. జీఎస్‌టీ నిబంధనలను సరళీకృతం చేయడం, అందరికీ అందుబాటులో ఉండేలా చూడడం వంటి కారణాలతో 2018-19 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 11.77 లక్షల కోట్ల రూపాయల జీఎస్‌టీ వసూలైంది. మార్చి మాసంలో 1,06,577 కోట్ల రూపాయలు వసూలు అవడానికి ఉత్పత్తి, వినియోగ రంగాల పరిధి విస్తృతం కావడమే ప్రధాన కారణమని అంటున్నారు. మొత్తం మీద గత ఆర్థిక సంవత్సరంలో నెలకు సగటున 98,114 కోట్ల రూపాయల జీఎస్‌టీ వసూలైంది. 2017-18 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 9.2 శాతం అధికం. ఇటీవల కాలంలో ఆదాయం పెరగడం ఆరంభమైందనడానికి ఇదే నిదర్శనం. వివిధ రకాలైన వస్తుసేవలకు వేరువేరు టారిఫ్‌ను నిర్ణయిస్తూ, ప్రభుత్వం హేతుబద్ధమైన నిర్ణయాలు తీసుకుందని, దాని ఫలితంగానే జీఎస్‌టీ ద్వారా ఆదాయం పెరుగుతున్నదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. గతనెల మొత్తం 1,06,577 కోట్ల రూపాయలు వసూలయ్యాయి. ఇందులో కేంద్ర జీఎస్‌టీ 20,353 కోట్ల రూపాయలుకాగా, రాష్ట్రాల జీఎస్‌టీ 27,520 కోట్ల రూపాయలని తెలిపారు. సమీకృత జీఎస్‌టీ మొత్తం 50,418 కోట్ల రూపాయలు. సెస్ మొత్తం 8,286 కోట్ల రూపాయలు. కాగా, ఏప్రిల్ మాసంలో జీఎస్‌టీ వసూళ్లు 1,13,865 కోట్ల రూపాయలుగా నమోదైంది. ఇందులో సెంట్రల్ జీఎస్‌టీ 21,163 కోట్ల రూపాయలు. స్టేడ్ జీఎస్‌టీ (ఎస్‌జీఎస్‌టీ) 28,801 కోట్ల రూపాయలు. సమీకృత జీఎస్‌టీ 54,733 కోట్ల రూపాయలు. సెస్ 9,168 కోట్ల రూపాయలు. జీఎస్‌టీని అమలు చేయడం మొదలు పెట్టిన తర్వాత ఇంత వరకూ ఎన్నడూ ఇంత భారీ ఎత్తున జీఎస్‌టీ వసూలు కాలేదు. 2019-19 ఆర్థిక సంవత్సరంలో జీఎస్‌టీ లక్ష కోట్ల రూపాయలకు మించడం ఇది ఐదోసారి. 2018 మార్చితో పోలిస్తే, 2019 మార్చిలో వసూలైన జీఎస్‌టీ 15.6 శాతం ఎక్కువని . అప్పట్లో 92,167 కోట్ల రూపాయలు వసూలైంది. కాగా, గత ఏప్రిల్‌లో జీఎస్‌టీ వసూళ్లు 1,03,459 కోట్ల రూపాయలు. అందులో సెంట్రల్ జీఎస్‌టీ 20,370 కోట్ల రూపాయలు, స్టేట్ జీఎస్‌టీ 15,975 కోట్ల రూపాయలు. మొత్తం మీద బడ్జెట్‌లో జీఎస్‌టీ ఆదాయాన్ని 11.47 లక్షల కోట్ల రూపాయలుగా అంచనా వేశారు. ఆ అంచనాలను మించిన వసూళ్లతో జీఎస్‌టీ కొత్త పుంతలు తొక్కుతున్నది.